Pak Visas For Hindu Pilgrims : 112 మంది హిందూ యాత్రికులకు పాక్ వీసాలు

పాకిస్తాన్ లో పంజాబ్‌ ప్రావిన్స్‌లోని చక్వాల్‌ జిల్లాలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాన్ని సందర్శించేందుకు 112 మంది భారతీయ హిందువులకు మంగళవారం పాకిస్తాన్ వీసాలు జారీ చేసింది.

Pak Visas For  Hindu Pilgrims : 112 మంది హిందూ యాత్రికులకు పాక్ వీసాలు

Temple

Updated On : December 15, 2021 / 3:45 PM IST

Pak Visas For Hindu Pilgrims :  పాకిస్తాన్ లో పంజాబ్‌ ప్రావిన్స్‌లోని చక్వాల్‌ జిల్లాలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాన్ని సందర్శించేందుకు 112 మంది భారతీయ హిందువులకు మంగళవారం పాకిస్తాన్ వీసాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

డిసెంబర్ 17-23 మధ్యలో శ్రీ కతాస్ రాజ్ టెంపుల్స్(ఖిల్లా ఖతాస్ లేదా కతాస్ టెంపుల్స్ కాంప్లెక్స్ గా కూడా పిలుస్తారు)ని హిందూ యాత్రికులు సందర్శిస్తారని తెలిపింది. కతాస్ రాజ్ ఆలయ సముదాయం..చెరువు చుట్టూ ఉండగా, వాటిని సందర్శించడాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తున్నారు.

1974లో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాలు మతపరమైన ప్రదేశాలను సందర్శించేందుకు వీసాలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాక్‌ భారతీయ యాత్రికుల కోసం వీసాలు ఇస్తున్నది. ఈ నెల ప్రారంభంలో… డిసెంబర్ 4 నుండి 15 వరకు సింధ్‌లోని షాదానీ దర్బార్ హయత్ పిటాఫీలో..శివ అవతారి సద్గురు సంత్ షాదరమ్ సాహిబ్ 313వ జయంతి వేడుకలకు హాజరు కావడానికి 136 మంది హిందూ యాత్రికులకు పాకిస్తాన్ హైకమిషన్ వీసాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ALSO READ US Covid Deaths : అమెరికాలో 8లక్షలు దాటిన కోవిడ్ మరణాలు..వ్యాక్సిన్ తీసుకున్నా కూడా