Drone Attack
Drone Attack : పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాద సంస్థలు, పాక్ అండదండలతో భారత్ పై దాడులకు తెగబడుతున్నాయి. భారత ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున 1.30 నిమిషాల సమయంలో భారత ఎయిర్ వేస్ స్థావరాన్ని టార్గెట్ చేసి డ్రోన్ దాడికి యత్నించారు. ఆ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే సోమవారం తెల్లవారు జామున 3.00 సమయంలో రెండు డ్రోన్లతో దాడికి యత్నించారు.
డ్రోన్ లను గమనించిన భద్రతాదళాలు 20 నుంచి 25 రౌడీలా కాల్పులు జరిపాయి. దీంతో ఆగంతకులు డ్రోన్లను వెనక్కు తీసుకెళ్లారు. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు డ్రోన్ దాడికి యత్నించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆగంతకులను గుర్తించే పనిలో పడ్డారు. అయితే ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో Lashkar-e-Taiba ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక భద్రతా దళాలు డ్రోన్లను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే భారీ ఎత్తున ఆస్తినష్టం ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. రక్షణ శాఖ దీనిపై స్పందించింది. భద్రతాదళాల పనితీరును మెచ్చుకుంది. పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశారని రక్షణ శాఖ తెలిపింది.