Pakistan
Pakistan : పాకిస్థాన్ చిల్లర పనులకు అంతేలేకుండా పోతుంది. భారతదేశంపై నిత్యం అసత్యాలతో కూడిన వ్యాఖ్యలు చేసే పాకిస్థాన్.. తమ దేశంలో పరిస్థితులు దిగజారుతున్నా సరిచేసుకొనే ప్రయత్నం చేయడం చేయడం లేదు. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నా.. ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ భారతదేశంపై దాడులకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే, తాజాగా.. పాకిస్థాన్ తనకు అలవాటుగా మారిన చిల్లర పనులతో ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకుంది.
దిత్వా తుపాను ఇటీవల శ్రీలంకలో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ తుపాను కారణంగా ఆ దేశం అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా 350మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.. వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. దాదాపు 11.18లక్షల మందిపై విపత్తు ప్రభావం పడిందని శ్రీలంక పేర్కొంది. దిత్వాతో భారీ నష్టపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. భారతదేశం కూడా శ్రీలంకకు అండగా నిలిచింది.
శ్రీలంకలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆపదలో ఉన్నవారిని రక్షిస్తున్నాయి. ఆపరేషన్ సాగర్ బంధు పేరిట శ్రీలంకలో భారత్ సహాయక చర్యలు నిర్వహిస్తోంది. అంతేకాక.. తమ వంతుగా ఆహారం, వైద్య సామగ్రి, అత్యవసర సదుపాయాలను శ్రీలంకకు అందిస్తోంది.
Pakistan
దిత్వా తుపాను ప్రభావంతో వణుకుతున్న శ్రీలంక కు భారత్ తో పాటు పాకిస్థాన్ సాయం అందించింది. అయితే, పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సింది పోయి.. వారికి గడువు ముగిసిన వస్తవులను సాయంగా పంపించిందనే వార్తలు వస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీలంక అధికారులు కూడా ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పాకిస్థాన్ హైకమిషన్ సోషల్ మీడియాలో స్వయంగా పంచుకున్న కొలంబోకు వెళ్లే సహాయ ప్యాకేజీలపై గడువు తేదీ ఇప్పటికే ముగిసినట్లుగా ఉంది. దీంతో పాకిస్థాన్ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకకు సాయంగా ఆహారం, ఔషదాలను పాకిస్థాన్ పంపించింది. ఇవి కొలంబోకు చేరుకున్న విషయాన్ని తెలయజేస్తూ శ్రీలంకకు పాకిస్థాన్ ఇప్పుడు ఎప్పుడూ అండగా ఉంటుంది అని ముద్రించిన ప్యాకెట్లను శ్రీలంకలోని పాకిస్థాన్ హై కమిషన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఆ ప్యాకెట్లపై గడువు తేదీ 2024 అక్టోబర్ లోనే ముగిసినట్లు తెలిసింది. వీటిని గమనించిన శ్రీలంక అధికారులు.. ఈ విషయాన్ని పాకిస్థాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. పాకిస్థాన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పాకిస్థాన్ పొరుగుదేశాలకు అందించే సహాయంలోనూ చిల్లర పనులకు పాల్పడటంతో ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Pakistan