Indian Coast Guard : పది మందితో భారత జలాల్లోకి ప్రవేశించిన పాక్ పడవ.. పట్టుకున్న అధికారులు

శనివారం రాత్రి సమయంలో గుజరాత్ తీరంలో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ పడవను భారత తీర రక్షక దళం అధికారులు పట్టుకున్నారు.

Indian Coast Guard : శనివారం రాత్రి సమయంలో గుజరాత్ తీరంలో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ పడవను భారత తీర రక్షక దళం అధికారులు పట్టుకున్నారు. అనంతరం తనిఖీ చేసి అందులోని 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ పడవ భారత జలాల్లోకి 6-7 మైళ్ళ లోపలికి వచ్చినట్లు తెలిపారు. శనివారం రాత్రి సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన నౌకను ఆపి తనిఖీ చేశామని.. అందులోని రెండు టన్నుల చేపలు, 600 లీటర్ల ఇంధనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

చదవండి :  ICGS Vigraha Ship : భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..

10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అయితే చేపల వేటకు భారత జలాల్లోకి వచ్చినట్లుగా పాక్ జాలర్లు చెబుతున్నారు. ఒక దేశ ప్రాదేశిక జలాల్లోకి మరో దేశం జాలర్లు రావడం నేరం.. అందునా పాక్ భారత శత్రుదేశం కావడంతో అధికారులు జాలర్లను అదుపులోకి తీసుకోని గుజరాత్ తీరానికి తీసుకొచ్చారు.
చదవండి : Kerala Coastal Areas : రాబోయే ఏళ్లలో కేరళ తీర ప్రాంతాల్లో విపత్తు పొంచి ఉంది.. నిపుణుల హెచ్చరిక

 

 

ట్రెండింగ్ వార్తలు