‘బతికితే ఇండియాలో బతుకుతాం.. లేకపోతే చస్తాం.. అంతే కానీ ఆ పాకిస్థాన్ మాత్రం వెళ్లం’

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో.. పాకిస్థాన్ నుంచి పొట్ట చేతపట్టుకొని భారత్ కు వచ్చిన హిందూ శరణార్థులు..

Pakistani Hindu Refugees

Pahalgam attack: జమ్మూకశ్మీర్ ప్రాంతంలో పహల్గాంలో ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఆధారాలు లభిస్తుండటంతో ఆ దేశానికి గుణపాఠం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేస్తున్నామని, వాళ్లంతా ఈనెల 27వ తేదీలోగా భారత్ విడిచి వెళ్లిపోవాలని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దీనికితోడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని రాష్ట్రాల్లో పాకిస్థానీయుల వివరాలను సేకరించి వారిని దేశం నుంచి పంపించివేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో పాకిస్థానీ హిందూ శరనార్థులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: Indus Waters Treaty: సింధూ ఒప్పందం నిలిపివేత సాధ్యమే.. ఆర్టికల్‌ 62 ఏం చెబుతుంది..? ఐసీజే తలుపు తట్టినా పాక్‌కు షాక్ తప్పదా..!

తాము భారతదేశంలోనే ఉంటామని హిందూ శరణార్థులంతా కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పాకిస్థాన్ లో హిందూ మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉందని, తిరిగి అక్కడికి వెళ్తే తమను మళ్లీ హింసిస్తారని ఆవేదన చెందున్నారు. నరకం లాంటి పాకిస్థాన్ కు వెళ్లేందుకు మేము సిద్ధంగా లేమని, ఇండియాలో చావడానికైనా సిద్ధమేనంటూ పేర్కొంటున్నారు. అక్కడ తమకు ఎలాంటి ఆస్తులు లేవని, అన్నింటిని అమ్ముకొని వచ్చామని.. ఇప్పుడు మేము ఎక్కడికెళ్లాలంటూ పాకిస్థానీ హిందూ శరణార్థులు ఆవేదన చెందుతున్నారు.

Also Read: Pahalgam Terror Attack: దెబ్బ అదుర్స్ కదా.. భారత్ దెబ్బకు విలవిల్లాడుతున్న పాకిస్థాన్.. ఏం జరుగుతుందో చూడండి..

పాకిస్థాన్ నుంచి పొట్ట చేతపట్టుకొని భారత్ కు వచ్చిన హిందూ శరణార్థులు రెఫ్యూజీ క్యాంపులలో ఉంటున్నారు. వీరిలో కొంత మంది ఢిల్లీలోని మజ్నూకా తిల్లా, రాజస్తాన్ జైసల్మేర్ లోని ఏకలవ్య భిల్ బస్తీలో నివాసం ఉంటున్నారు. భారత ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పుడు వారంతా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి. వీరిలో కొన్ని సంవత్సరాలుగా.. నెలలుగా ఇక్కడ ఉంటున్నవారు ఉండగా.. పహల్గాంలో ఉగ్రదాడికి కొద్దిరోజుల ముందు భారత్ కు వచ్చినవారు ఉన్నారు.

 

‘‘ఢిల్లీలోని మజ్నాకా తిల్లాలోని హిందూ శరణార్థుల కమ్యూనిటీకి అధ్యక్షుడు సోనాదాస్ మాట్లాడుతూ.. తాము ఎన్నోఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడికి ఒకట్రెండు నెలలు కింద వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. మా వీసాలను భారత ప్రభుత్వం రెండేండ్లకోసారి రెన్యూవల్ చేస్తుంది. ఉగ్రదాడి నేపథ్యంలో శరణార్థులందరి డాక్యుమెంట్లను పోలీసులు మళ్లీ చెక్ చేస్తున్నారు. ఇప్పడేం జరుగుతుందో తెలియక అందరూ ఆందోళన చెందుతున్నారు.’’ అంటూ వాపోయాడు. తాము ఎన్నో ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు వెళ్లగొట్టవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.