Abrar Hasan : పాకిస్తాన్ వ్లాగర్ అబ్రార్ హసన్ భారత్‌లో బైక్ టూర్ .. ఫిదా అయిన ఇండియన్స్

పాకిస్తాన్ వ్లాగర్ అబ్రార్ హసన్ భారత్‌లో బైక్ టూర్ అందర్నీ ఆకట్టుకుంది. రెండు దేశాల మధ్య సరిహద్దుల్ని చెరిపేస్తూ అతను భారతీయులతో మసలుకున్న తీరు ఇక్కడివారి మనసుల్ని కొల్లగొట్టింది.

Pakistani vlogger Abrar Hasan

Pakistani vlogger Abrar Hasan : పాకిస్తాన్ వ్లాగర్ అబ్రార్ హసన్ భారతదేశం అంతా బైక్ టూర్ తిరిగాడు. అతని ప్రయాణాన్ని కేవలం సాహసంగా మాత్రమే కాకుండా  దేశ సరిహద్దులు దాటిన స్నేహానికి నిదర్శనంగా చెప్పుకోవాలి.

Pakistan : పాకిస్తాన్‌లో హోలీ వేడుకలు.. సందడి చేసిన క్వాయిడ్-ఐ-అజం యూనివర్సిటీ విద్యార్థులు

అబ్రార్ ఇండియాలో కేవలం 30 రోజుల్లో 7,000 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించాడు. ఎంతో అందమైన ప్రకృతి దృశ్యాలు, నగరాలు చూసాడు. తన BMW ట్రైల్ బైక్‌పై వేసే ప్రతి అడుగును తన యూట్యూబ్ ఛానెల్ WildLens లో పోస్ట్ చేశాడు. అతను వెళ్లిన దారిలో కలిసిన వ్యక్తులు వారితో ఏర్పడ్డ బంధాన్ని వివరించాడు. కొత్త స్నేహితులతో కలిసి భోజనం చేస్తూ.. అందరితో కలిసిపోతూ ఐక్యతకు స్ఫూర్తిగా నిలిచాడు.

 

అబ్రార్ ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ముంబయి, కేరళలో తనకు లభించిన ఆప్యాయత, ఆదరణ గురించి పంచుకున్నాడు. భారత్ చూడాలనే తన చిరకాల స్వప్నం నెరవేరినందుకు అతను చాలా సంతోషించాడు. ‘ఇండియాకు స్వాగతం.. నేను, నా  బైక్ వీసా పొందడానికి సంవత్సరాల తరబడి చేసిన ప్రయత్నం చివరికి సాధించాను’ అంటూ ఇన్‌‌స్టాగ్రామ్‌లో అతను చేసిన పోస్టు ఇండియా రావడానికి ఎంతగా కల కన్నాడో స్పష్టం చేస్తోంది. . అతని పోస్టుపై చాలామంది స్పందించారు. ‘మా దేశానికి స్వాగతం.. మీకు ఇక్కడ ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉండవచ్చు’ అంటూ సెంటిమెంట్‌గా కామెంట్లు పెట్టారు.

Pakistan : దైవ దూషణ చేశాడని పాకిస్తాన్ లో యువకుడికి మరణ శిక్ష

అబ్రార్ కొత్త సంప్రదాయానికి తెర తీశాడు. రెండు దేశాల మధ్య స్నేహాన్ని చాటాడు. అతని బైక్ టూర్ కేవలం సాహస యాత్ర మాత్రమే కాదు.. సరిహద్దులు దాటి స్నేహాన్ని ఎలా పంచుకోవచ్చునో తెలుపుతోంది.