48 Flights Cancels : పాక్‌లో ఇంధన కొరతతో 48 విమానాల రద్దు

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో ఇంధన కొరతతో 48 విమానాలను రద్దు చేశారు. జాతీయ క్యారియర్ అయిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఇంధనం అందుబాటులో లేని కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్గాలతో సహా 48 విమానాలను రద్దు చేసింది...

PAK Flight

48 Flights Cancels : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో ఇంధన కొరతతో 48 విమానాలను రద్దు చేశారు. జాతీయ క్యారియర్ అయిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఇంధనం అందుబాటులో లేని కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్గాలతో సహా 48 విమానాలను రద్దు చేసింది. రోజువారీ విమానాలకు పరిమిత ఇంధన సరఫరా, కార్యాచరణ సమస్యల కారణంగా విమానాలు రద్దు చేశారు. కొన్ని విమానాలను రీషెడ్యూల్ చేశామని అధికార ప్రతినిధి తెలిపారు. ఇంధనం అందుబాటులో లేకపోవడంతో 13 దేశీయ విమానాలు, అంతర్జాతీయ మార్గాల్లో 11 విమానాలు రద్దు చేసినట్లు అధికార ప్రతినిధి తెలిపారు.

Also Read : No Flight Services : 5 గంటల పాటు విమానాల రాకపోకల నిలిపివేత.. ఎందుకంటే ?

మరో పన్నెండు విమానాలు ఆలస్యం అయ్యాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని పాకిస్థాన్ స్టేట్ ఆయిల్ బకాయిల కారణంగా సరఫరాను నిలిపివేయడం వల్ల పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానాలకు ఇంధన కొరత ఏర్పడింది. పేరుకుపోయిన అప్పుల కారణంగా విమానయాన సంస్థ ఇప్పటికే పతనం అంచున నిలిచింది. ప్రైవేటీకరణ దిశగా పయనిస్తున్న విమానయాన సంస్థ భవిష్యత్తు అస్పష్టంగానే ఉంది.

Also Read : Pakistan Rangers Open Fire : జమ్మూ సరిహద్దుల్లో పాక్ రేంజర్ల కాల్పులు…ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలు

జాతీయ విమానయాన సంస్థ కోరినప్పటికీ రూ. 23 బిలియన్ల నిర్వహణ ఖర్చులను అందించడానికి పాకిస్థాన్ ప్రభుత్వం నిరాకరించడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. రాజకీయ అస్థిరతతోపాటు పాకిస్థాన్ తన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో విమానాల రద్దు పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 21.3 శాతానికి చేరుకుంది.

Also Read : Airstrike : గాజా ఆసుపత్రిపై వైమానిక దాడిలో 500 మంది మృతి

గత ఏడాది కాలంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ దాదాపు సగం కోల్పోయింది. సెప్టెంబరులో దేశ చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 దాటాయి. ప్రధానమంత్రి అన్వారుల్ హక్ కకర్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డి) ధరలను లీటరుకు రూ.14.91,రూ.18.44 చొప్పున పెంచింది.

Also Read :Gaza : గాజాకు 100 మిలియన్ డాలర్ల గల్ఫ్ కౌన్సిల్ అత్యవసర సాయం

ఈ ధరల పెంపుతో పెట్రోల్ ధర రూ.305.36గా ఉండగా, డీజిల్ ధర రూ.311.84కి చేరింది. పెరుగుతున్న కరెంటు బిల్లులపై పాకిస్థాన్‌లో కూడా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ముల్తాన్, లాహోర్, కరాచీ, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ తో సహా పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.