Pakistan Rangers Open Fire : జమ్మూ సరిహద్దుల్లో పాక్ రేంజర్ల కాల్పులు…ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలు
జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైనికులు పేట్రేగిపోయారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరపడంతో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు....

BSF Personnel
Pakistan Rangers Open Fire : జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైనికులు పేట్రేగిపోయారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరపడంతో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. మంగళవారం ఉదయం 8.15 గంటలకు అర్నియా సెక్టార్‌లోని విక్రమ్ పోస్ట్‌పై పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు ప్రారంభించారు.
Also Read : Airstrike : గాజా ఆసుపత్రిపై వైమానిక దాడిలో 500 మంది మృతి
ఈ కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు బుల్లెట్లు తగిలాయని, వారికి వెంటనే వైద్య సహాయం అందించామని బీఎస్ఎఫ్ ప్రకటన పేర్కొంది. కాల్పుల ఘటనను పాకిస్థాన్ రేంజర్స్‌తో ప్రస్తావించి వారిపై ఫిర్యాదు చేయనున్నట్టు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. కాల్పులు ప్రారంభమైనప్పుడు సరిహద్దు పోస్ట్ సమీపంలో విద్యుత్ పనులు చేస్తున్న ఇద్దరు బీఎస్ఎఫ్ ట్రూపర్లను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.
Also Read : Bonus : ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు
2021వ సంవత్సరంలో ఫిబ్రవరి 25వ తేదీన భారతదేశం, పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి కాల్పుల విరమణపై అన్ని ఒప్పందాలను ఖచ్చితంగా పాటించాలని రెండు దేశాలు నిర్ణయించాయి.