Pakistan PM Imran : భారత్‌కు సెల్యూట్ చేసిన ఇమ్రాన్ ఖాన్.. విదేశాంగ విధానం భేష్ అంటూ పొగడ్తలు

ఇమ్రాన్‌ఖాన్‌ పదవికి గండం ఏర్పడే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. పదవి నుంచి దిగిపోవాలంటూ ఇమ్రాన్‌ కు పాక్‌ సైన్యం అల్టిమేటమ్‌ ఇచ్చిందన్న సమయంలో వ్యాఖ్యలు చేశారు.

Imran Khan praised India : పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్వరం ఒక్కసారిగా మారింది. పదవి కిందకు నీళ్లొచ్చేసరికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తత్వం బోధపడినట్లుంది. తన తత్వానికి భిన్నంగా భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మలాఖండ్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్‌ భారత్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఐ సెల్యూట్‌ ఇండియా అంటూ ఎవరూ ఊహించని విధంగా మాట్లాడారు. భారత్‌ ఎప్పుడూ స్వతంత్ర విదేశాంగ విధానం అవలంభిస్తోందని అన్నారు. ఆ విదేశాంగ విధానం ప్రజలకు మేలు చేసేలా ఉంటుందని వ్యాఖ్యానించారు.

ప్రజలకు మేలు చేకూరేలా ప్రభుత్వాలు పనిచేస్తాయన్నారు. రష్యా నుంచి భారత్‌ ఆయిల్‌ కొనుగోలు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. క్వాడ్‌లో భారత్‌ సభ్యదేశమైనా రష్యా నుంచి ఆయిల్‌ కొంటోందని ఇది ఆ దేశ ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు. అదే సమయంలో భారత్ సైన్యంపైనా ఆయన ప్రశంసలు గుప్పించారు. భారత సైన్యం ఎప్పుడూ ప్రభుత్వంలో జోక్యం చేసుకోదన్నారు.

Pak : కూరగాయల ధరలు కట్టడి చేయటానికి రాజకీయాల్లోకి రాలేదు: ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్‌ఖాన్‌ పదవికి గండం ఏర్పడే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. పదవి నుంచి దిగిపోవాలంటూ ఇమ్రాన్‌ఖాన్‌కు పాక్‌ సైన్యం అల్టిమేటమ్‌ ఇచ్చిందన్న సమయంలో ఆయన భారత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పాక్‌ పాలకులు ఎవరూ భారత్‌పై ప్రశంసలు కురిపించరు. బహిరంగంగా అయితే అసలు చేయరు. అయితే ఇమ్రాన్‌ నేరుగా ఓ ర్యాలీలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పాక్‌లో కలకలం రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు