Pak : కూరగాయల ధరలు కట్టడి చేయటానికి రాజకీయాల్లోకి రాలేదు: ఇమ్రాన్ ఖాన్

గత 25 ఏళ్లుగా తాను సత్యం గురించి చెబుతున్నానని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు, పాక్ ముస్లిం లీగ్ నవాజ్ అధ్యక్షులు షెహబాబ్ షరీఫ్ నివాసంలో ప్రతిపక్ష పార్టీల నేలు సమావేశం కానున్నారు...

Pak : కూరగాయల ధరలు కట్టడి చేయటానికి రాజకీయాల్లోకి రాలేదు: ఇమ్రాన్ ఖాన్

Punjab pak

Not In Politics For Aloo, Tamatar : దేశ యువత కోసం రాజకీయాల్లోకి రావాలని 25 ఏళ్ల క్రితమే నిర్ణయించుకోవడం జరిగిందని, ఆలూ, టమాట ధరలను తెలుసుకొనేందుకు రాజకీయాల్లోకి రాలేదని పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. మిగిలిన పాలనా కాలం పూర్తయ్యే సరికి పాక్ ఓ గొప్ప దేశంగా అవతరించబోతోందని జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాల ఫలితాలు త్వరలో తెలుస్తాయన్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై పీఎం ఇమ్రాన్ గుస్సుగా ఉన్నారు.

Read More : Russia Ukraine War : రష్యాలో ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం.. 8 కోట్ల మంది యూజర్లు యాక్సస్ చేసుకోలేరు..!

ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై తీవ్రంగా స్పందించారు. పంజాబ్ ప్రావిన్స్ లోని హఫీజాబాద్ లో ఓ ర్యాలీ జరిగింది. అందులో పాల్గొన్న ఇమ్రాన్.. డబ్బుతో చట్టసభ్యుల మనస్సాక్షిని కొనుగోలు చేసుకొనేందుకు ప్రయత్నిస్తూ.. తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వారి ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశం నిలబడుతుందని, ప్రతొక్కరి కలలు నెరవేర్చే బాధ్యత తనదని.. ఇలా చేయడం వల్ల తనకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు.

Read More : Dementia : పుతిన్‌‌కు పార్కిన్సన్ వ్యాధి.. బ్రిటన్ మీడియా ఆరోపణలు

గత 25 ఏళ్లుగా తాను సత్యం గురించి చెబుతున్నానని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు, పాక్ ముస్లిం లీగ్ నవాజ్ అధ్యక్షులు షెహబాబ్ షరీఫ్ నివాసంలో ప్రతిపక్ష పార్టీల నేలు సమావేశం కానున్నారు. ఓ వైపు అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకుని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీనిని ఎదుర్కొనేందుకు ఇమ్రాన్ సంసిద్ధమౌతున్నారు.