Pan Aadhaar Linking Deadline Extended To June 30, 2021
PAN-Aadhaar linking deadline extended : ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువును పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మార్చి 31, 2021 నుంచి జూన్ 30, 2021 వరకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనా మమహ్మారి నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
ఆధార్ తో పాన్ నెంబర్ లింక్ చేసుకునే గడువును పొడిగిస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. మార్చి 31 వరకు మాత్రమే గడువు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ గడువు తేదీ కూడా ముగియడంతో ట్యాక్స్ పేయర్లలో ఆందోళన నెలకొంది.
Central Government extends the last date for linking of Aadhaar number with PAN from 31st March, 2021 to 30th June, 2021, in view of the difficulties arising out of the COVID-19 pandemic.(1/2)@nsitharamanoffc@Anurag_Office@FinMinIndia
— Income Tax India (@IncomeTaxIndia) March 31, 2021
ఆధార్ తో పాన్ లింక్ చేయకపోతే రూ.1000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడీ గడువు తేదీ జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దాంతో ఇప్పటివరకూ పాన్-ఆధార్ లింకు చేయని వారు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది.