దేశానికి తొలి పతకం తెచ్చింది: ఇప్పుడు బీజేపీలోకి!

  • Publish Date - March 26, 2019 / 03:48 AM IST

పారాలింపిక్ పోటీల్లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన ప్రముఖ అథ్లెట్ దీపా మాలిక్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ హరియాణా చీఫ్ సుభాష్ బరాలా, ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ సమక్షంలో ఆమె కాషాయ గూటికి చేరుకున్నారు. మహిళా సాధికారతకు ప్రధాని మోడీ ఎంతగానో కృషి చేస్తున్నారని,  మహిళలకు మోడీ సముచిత స్థానం ఇస్తున్నారని, కేబినెట్‌లో కూడా మహిళలలకు ఉన్నత పదవులు ఇస్తుండడంతో బీజేపీలో చేరినట్లు దీపా మాలిక్ వెల్లడించారు.

అలాగే దివ్యాంగుల కోసం మోడీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఆమె ప్రశసించారు. అయితే హర్యానాలోని ఒక లోక్‌సభ నుండి ఆమె పోటీలోకి దిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్.. దీపామాలిక్ అందరికీ స్ఫూర్తి అని, దేశానికి గర్వకారణమని, అందుకే ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.