నిరసనల పేరుతో సాగించే హింస దేశాన్ని బలహీనపరుస్తుంది : రాష్ట్రపతి కోవింద్

  • Publish Date - January 31, 2020 / 05:50 AM IST

ఈ దశాబ్దం ఎంతో కీలకమన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఈ దశాబ్దంలో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకుంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం 2020, జనవరి 31వ తేదీ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి  రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ…

నవభారత్ నిర్మాణానానికి అందరూ కృషి చేయాలని, అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, పటేల్, లోహియా, దీన్ దయాల్ ఆశయాలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగానుసారం పనిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత సమావేశాల్లో పార్లమెంట్ సరికొత్త రికార్డు సృష్టించిందని, ట్రిపుల్ తలాక్ సహా పలు చట్టాలను ఈ ప్రభుత్వం తెచ్చిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్ వల్ల మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందన్నారు. 

ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అనేక కొత్త చట్టాలను తీసుకొచ్చిందన్నారు. అంతేగాకుండా..పలు కీలక బిల్లులకు గత సమావేశాలు ఆమోదం తెలిపాయన్నారు. ప్రభుత్వం ధృడ సంకల్పంతో అనేక కొత్త కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జమ్మూ కాశ్మీర్, లద్దాక్ ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతోందన్నారు.

ఇక్కడి ప్రజలకు సమాన హక్కులు కల్పించామన్నారు. రామజన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రజల ఐక్యత హర్షణీయమని కొనియాడారు. హింస వల్ల దేశ ప్రతిష్ట దిగజారుతుందన్నారు. పేదలందరికీ
లబ్ది చేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

 

స్పీచ్ హైలెట్స్ : – 
* గత ఐదేళ్లలో భారత దేశ వృద్ధి మెరుగుపడింది. 
* ప్రభుత్వ పథకాలు దేశ ప్రజలందరికీ అందుతున్నాయి. 
* జమ్మూ కాశ్మీర్‌లో 4 వేల 400 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాం. 

* ఆర్టికల్ 370 రద్దు చరిత్రాత్మకం.
* గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. 
* ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం. 

* తమ ప్రభుత్వానికి ప్రజలు విస్పష్ట తీర్పిచ్చారు. 
* ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారత్ మెరుగైన స్థానం సంపాదించింది. 
* కర్తార్‌పూర్ కారిడార్ తెరవడం చారిత్రాత్మకం. 

* రైతులు, పేదల ఆశలు నెరవేర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 

Read More : TikTok పోటీగా..Google App Tangi