Parliament Budget Session : రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

దేశ సురక్షిత భవిష్యత్‌ కోసం గతాన్ని గుర్తు తెచ్చుకోవడం ముఖ్యమన్నారు. గత స్మృతుల నుంచి నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమని, వచ్చే 25 ఏళ్లపాటు పునాదులు పటిష్టంగా ఉండేలా...

President Ramnath Kovind Speech :  భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2022, జనవరి 31వ తేదీ సోమవారం ఉదయం సభలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. పార్లమెంట్ కు చేరుకున్న రాష్ట్రపతికి రాజ్యసభ ఛైర్మన్, లోక్ సభ స్పీకర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రసంగించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా కరోనా సమయంలో భారత దేశం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మెచ్చుకున్నారు. కరోనాపై పోరాటంలో భాగమైన ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తలకు అభినందనలు తెలియచేయడం జరుగుతోందని, కరోనాపై పోరాటంలో పౌరుల ప్రయత్నాలకు అభినందనలు తెలిపారు. ఏడాదిలోపే 150 కోట్లకుపైగా వ్యాక్సిన్లు అందించిన రికార్డును అధిగమించామన్నారు.

Read More : Parliament Budget Session 2022 : రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు

కోట్లమంది ప్రాణాలు కాపాడిన వ్యాక్సిన్లు : –
భారత వ్యాక్సిన్లు కోట్లమంది ప్రాణాలను కాపాడినట్లు, అర్హులైన 90 శాతం కంటే ఎక్కువమంది మొదటి డోసు టీకా తీసుకున్నారని వివరించారు. ప్రభుత్వ సున్నిత విధానాలతో సామాన్యులకు సులభంగా వైద్యసేవలు అందడం జరుగుతోందని, సామాన్యులకు సులభంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కోవిడ్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, అయినా..ఇలాంటి పరిస్థితుల్లో కూడా కేంద్రం, రాష్ట్రాలు, వైద్యులు, నర్సులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలు ఒక జట్టుగా పనిచేశారని ప్రశంసించారు. ప్రతి భారతీయుడికి స్వాతంత్య్ర అమృతోత్సవ్‌ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు, సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ మూలసూత్రంతో కేంద్ర ప్రభుత్వంతో పని చేస్తోందన్నారు. దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నట్లు, దేశ సురక్షిత భవిష్యత్‌ కోసం గతాన్ని గుర్తు తెచ్చుకోవడం ముఖ్యమన్నారు. గత స్మృతుల నుంచి నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమని, వచ్చే 25 ఏళ్లపాటు పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రశంసించారు.

Read More : Budget 2022 : పార్లమెంట్ సమావేశాలకు వేళాయే.. ఈసారి రెండు విడతలు

డిజిటల్‌ ఇండియాకు యూపీఐ విజయవంతమైన ఉదహరణ : –
డిజిటల్‌ ఇండియాకు యూపీఐ విజయవంతమైన ఉదహరణ అని సభకు తెలిపారు. డిజిటల్‌ చెల్లింపులు అంగీకరిస్తున్నారనేందుకు ఇదే గొప్ప ఉదాహరణ అన్నారు. ప్రభుత్వ కృషితో యోగా, ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యానికి ఆదరణ పెరుగుతోందని, జనఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకు అందుబాటులో మందులున్నాయన్నారు. మందులు తక్కువ ధరతో ప్రభుత్వం చికిత్స ఖర్చును తగ్గించినట్లు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో మహిళల పాత్ర మరింత విస్తృతం కావాలనే పిలుపునిచ్చారు. 2021-22లో 28 లక్షల స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.65 వేల కోట్ల సాయం అందించారని వివరించారు. ఈ మొత్తం 2014-15 కంటే 4 రెట్లు ఎక్కువ అన్నారు రాష్ట్రపతి. అలాగే…పీఎం కిసాన్‌ ద్వారా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందన్నారు. రైతు కుటుంబాలు రూ.1.80 లక్షల కోట్లు పొందారనే విషయాన్ని రాష్ట్రపతి చెప్పారు. గతేడాది కాలంలో 24 వేల కి.మీ. మేర రైల్వే లైను నిర్మాణాలు, దేశవ్యాప్తంగా 21 గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు నిర్మాణం జరిగాయన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత యువశక్తి సామర్థ్యం ఎంటో చూడడం జరిగిందని, అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ 7 పతకాలు సాధించిందన్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో కూడా భారత్ 19 పతకాలు సాధించి రికార్డు సృష్టించిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు