Parliament Budget Session 2022 : రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. తొలిరోజు నుంచే టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసనలు తెలిపారు.  సీఎం కేసీఆర్ నిర్దేశనం మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని టిఆర్ఎస్ ఎంపీలు బహి

Parliament Budget Session 2022 : రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు

Parliament Budget Session 2022

Parliament Budget Session 2022 : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. తొలిరోజు నుంచే టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసనలు తెలిపారు.  సీఎం కేసీఆర్ నిర్దేశనం మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని టిఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు.

తెలంగాణ పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండి నిరసన తెలిపారు. వారంతా ఈరోజు సాయంత్రానికి ఢిల్లీ చేరుకోనున్నారు.  విభజన హామీలు,ఆర్ధిక సంఘం సిఫారసులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు,జీఎస్టీ నిధులు సహా 23 అంశాలపై పోరాడాలని సీఎం కేసీఆర్ ఎంపిలకు దిశానిర్దేశం చేశారు.
Also Read : Assembly Elections : ఎన్నికల ప్రచార ర్యాలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం
రేపటి బడ్జెట్‌లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్‌లో రోజూ   నిరసనలు కొనసాగించాలని  ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా బయటా పోరాడాలని టీఆర్ఎస్ ఎంపీలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం టీఆర్‌ఎస్ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకురానుంది.