New Parliament Inauguration: నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.. మొదలైన పూజా కార్యక్రమాలు

కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.

New Parliament: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించనున్నారు. ఉదయం 7.15 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. వైదిక క్రతువుతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలయ్యాయి. రెండు దశల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. మొదటి దశలో 7.15 గంటల నుంచి 9.30 గంటల వరకు ఆరాధనోత్సవం, 11.30 గంటల నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఉదయాన్నే ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. అదేవిధంగా సెంట్రల్ ఢిల్లీ, పార్లమెంట్ భవన పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పార్లమెంట్ భవనాన్ని సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దారు.

New Parliament : కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం.. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం!

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 21 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. ఈ కార్యక్రమంలో 25 పార్టీల నేతలు పాల్గోనున్నారు. ఏపీ నుంచి వైఎస్ఆర్ సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేకాక, టీడీపీ తరపున ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ గైర్హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి బీజేపీ, శివసేన, నేషనల్ పీపుల్స్ పార్టీ, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ, అప్పాదళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, తమిళ్ మనీలా కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, వైసీపీ, టీడీపీ, శిరోమణి అకాలీదళ్, బిజు జనతాదళ్‌తో పాటు పలు పార్టీల ప్రతినిధులు పాల్గోనున్నారు.

New Parliament : పార్లమెంట్ ప్రారంభోత్సవ వివాదాన్ని,తెలంగాణ సచివాలయ ఓపెనింగ్‌‌ని ప్రస్తావిస్తు తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా  75 రూపాయల నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. కొత్త పార్లమెంటు భవనం చిత్రం నాణెంపై ఉంటుంది. పార్లమెంటు చిత్రం కింద 2023 సంవత్సరం అనికూడా ముద్రించి ఉంది. నాణెంపై భారతదేశం అని హిందీలో, ఇంగ్లీష్ లో వ్రాయబడి ఉంది. దీనిపై అశోక చిహ్నం కూడా ఉంది. 75 రూపాయల నాణెం ఫొటోను ఏఐ ఇప్పటి విడుదల చేసింది.

New Parliament : కొత్త పార్లమెంట్‌లో రాజదండం..దాని చరిత్ర, ప్రాధాన్యత ఏంటో తెలుసా..? భారత స్వాతంత్ర్య ప్రకటనకు రాజదండానికి సంబంధమేంటీ?

ప్రారంభోత్సవ కార్యక్రమం షెడ్యూల్ ఇలా..

– ఉదయం 7.30 గంటలకు పూజ కార్యక్రమాలు ప్రారంభం.

– తమిళనాడు నుంచి వచ్చిన వేదపండితులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

– ఉదయం 8.30 గంటలకు పార్లమెంట్ ప్రాంగణంలోని గదులు, ఛాంబర్స్‌ను ప్రధాన మంత్రి, ప్రముఖులు సందర్శిస్తారు. అనంతరం సెంగోల్ యొక్క సంస్థాపన కార్యక్రమం ఉంటుంది.

– ఉదయం 8:45 గంటలకు కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

– ఉదయం 9.00 గంటలకు ప్రార్థనా సమావేశం ఉంటుంది.

– ఉదయం11.30 గంటలకు పార్లమెంట్‌కు చేరుకోనున్న అతిథులు.

– మధ్యాహ్నం 12.00 గంటలకు వేదికపైకి చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ.

– మధ్యాహ్నం 12.07 గంటలకు జాతీయ గీతం.

– మధ్యాహ్నం 12.10 గంటలకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్వాగత ప్రసంగం.

– మధ్యాహ్నం 12.29కి ఉపరాష్ట్రపతి సందేశం.

– మధ్యాహ్నం 12.33 గంటలకు రాష్ట్రపతి సందేశం.

– మధ్యాహ్నం 12.38 గంటలకు ప్రతిపక్ష నేతల ప్రసంగం.

– మధ్యాహ్నం 12.43 గంటలకు లోక్‌సభ స్పీకర్ ప్రసంగం

– మధ్యాహ్నం 1.00 గంటలకు 75 రూపాయల నాణెం, స్టాంపును విడుదల చేయనున్న ప్రధాని

– మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ.

– ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరైన అతిధులకు  లోక్‌సభ సెక్రటరీ జనరల్ ముగింపు కృతజ్ఞతలు తెలపనున్నారు.

ట్రెండింగ్ వార్తలు