Security Breach
Parliament: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది. లోక్‌సభ విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు అలజడి రేపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటికొచ్చాయి.
* విజిటర్ గ్యాలరీ నుంచి మొదట ఓ వ్యక్తి హౌస్ చాంబర్‌లోకి దూకాడు. గ్యాలరీ బ్యారియర్ కు కాసేపు వేలాడాడు
* ఆ సమయంలో మరో ఆగంతకుడు విజిటర్ గ్యాలరీలోనే కూర్చున్నాడు. విజిటర్ గ్యాలరీలో కూర్చున్న వ్యక్తే పసుపు, ఎరుపు రంగులో పొగను స్ప్రే చేశాడు. షూలో దాచి ఆ గ్యాస్ టిన్ ను లోక్ సభలోకి తెచ్చినట్లు తెలుస్తోంది
* ఆ ఇద్దరు ఆగంతకులు ‘ఈ నిరంకుశత్వం అంగీకరించదగింది కాదు’ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత మొత్తం నలుగురు నిందితులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు
* లోక్ సభలో బీజేపీ ఎంపీ ఖర్గేన్ ముర్ము మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది
sagar sharma pass
* లోక్సభలో దూకిన ఆగంతకుడి పేరు సాగర్శర్మగా గుర్తించారు. అతడి ఎంట్రీ పాస్ ను అధికారులు పరిశీలించారు
VIDEO | Visuals from inside Lok Sabha when the reported security breach took place.
More details are awaited. #Parliament pic.twitter.com/O9n9nu6ZKj
— Press Trust of India (@PTI_News) December 13, 2023
* సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజు పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగింది. 2001లో జరిగిన ఆ ఉగ్రదాడిలో అమరులకు ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాళులు ఇవాళ ఉదయం అర్పించారు. 22 ఏళ్ల క్రితం ఉగ్రదాడి జరిగిన డిసెంబరు 13ను గుర్తు చేసేలా ఇదే రోజు ఆగంతకులు కలకలం రేపడం గమనార్హం.
2 Men Jump Into Lok Sabha: లోక్‌సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన అగంతకులు