పరోటా.. రోటీ ఒకటి కాదు.. జీఎస్టీ 18శాతం వర్తిస్తుంది

  • Publish Date - June 12, 2020 / 08:13 AM IST

పరోటా, రోటీ.. చూడడానికి తినడానికి దాదాపు ఒకేలా ఉంటాయి. అందులో సందేహం లేదు. అయితే జీఎస్‌టీ విషయానికి వస్తే మాత్రం వీటి రెండింటి మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తుంది. దీంతో ధరల్లో తేడాలు వచ్చేస్తున్నాయి.

అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (AAR)  ప్రకారం ‘పరోటా’ ను చాప్టర్ హెడ్డింగ్ 2106 కింద వర్గీకరించగా.. అది సాదా చపాతీ లేదా రోటీ కాదు కాబట్టి 18% వస్తువులు మరియు సేవా పన్ను దానికి వర్తిస్తుందని నిర్ణయించింది. ఐడి ఫ్రెష్ ఫుడ్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ అనే ఆహార ఉత్పత్తుల సంస్థ చేసిన దరఖాస్తుకు స్పందనగా ఈ విషయాన్ని వెల్లడించింది. 

హోల్ గోధుమ పరోటా మరియు మలబార్ పరోటా తయారీని 1905 వ అధ్యాయం కింద వర్గీకరించాలా? వద్దా అనే అంశంపై దరఖాస్తుదారు ముందస్తు తీర్పును కోరారు. కాగా పరోటాపై జిఎస్‌టిని 5శాతం ఉంచాలని కోరగా.. 1905 లేదా 2106 శీర్షిక కింద వర్గీకరించవలసిన షరతుల మేరకు పరోటా రోటీ విభాగంలోకి రాదని దానిపై 5% జీఎస్టీ రేటు వర్తించదని స్పష్టం చేశారు.

Read: అమ్మకు బొమ్మ రూపంలో నివాళి అర్పించిన ఆర్టిస్ట్..ఎంత అద్భుతంగా ఉందో చూడండీ