×
Ad

Train Collides: ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు దుర్మరణం..

సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Train Collides: ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు చనిపోయారు. బిలాస్ పూర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. జైరామ్ నగర్ స్టేషన్ దగ్గర ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్యాసింజర్ రైలు కోర్బా నుంచి బిలాస్ పూర్ వెళ్తోంది. కోర్బా ప్యాసింజర్ రైలు మొదటి కోచ్ గూడ్స్ రైలుపైకి ఎక్కింది.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, ట్రక్కు ఢీ.. ఆరుగురు దుర్మరణం.. పలువురికి గాయాలు..