గూగుల్ టాప్ సెర్చ్‌లో ఒకటిగా ‘పాస్‌పోర్ట్ సేవ’.. ఎందుకంటే?

అందరూ పాస్ట్ పోర్ట్ సేవ అనే పదాన్ని సెర్చ్ చేస్తూ ఆ పోర్టల్లోకి వెళ్తున్నారు.

ఎన్నడూ లేనిది ‘పాస్‌పోర్ట్ సేవ’ ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లో టాప్ ట్రెండింగ్ టాపిక్‌లలో ఒకటిగా ఉంది. అంటే చాలా మంది Passport Seva అని గూగుల్‌లో టైప్ చేస్తూ ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి దీన్ని సెర్చ్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ రావడానికి పెద్ద కారణమే ఉంది.

ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబరు 2 వరకు ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ అందుబాటులో లేదు. అంతకుముందే సంబంధిత అధికారులు ఓ ప్రకటన చేశారు. పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ టెక్నికల్ మెయింటెనన్స్ వల్ల 2024, ఆగస్ట్ 29 రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పనిచేయదని తెలిపారు.

పౌరులతో పాటు అందరు అధికారులకు ఆ సమయంలో సిస్టమ్ అందుబాటులో ఉండదని తెలిపారు. అయితే, ఆ షెడ్యూల్ కంటే ముందుగానే సెప్టెంబరు 1 రాత్రి 7 గంటల నుంచి ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆ పోర్టల్ పనిచేస్తోంది.

ఈ పోర్టల్ దాదాపు మూడు రోజుల పాటు అందుబాటులో లేకపోవడంతో దాన్ని ఎవరూ వినియోగించుకోలేకపోయారు. ఇప్పుడు పనిచేస్తుండడంతో ఒక్కసారిగా అందరూ పాస్ట్ పోర్ట్ సేవ అనే పదాన్ని సెర్చ్ చేస్తూ ఆ పోర్టల్ లోకి వెళ్తున్నారు.

Also Read: సరిగ్గా 20ఏళ్ల తర్వాత.. బుడమేరు దెబ్బకు మునిగిన విజయవాడ.. ఇది ఎవరి పాపం?

 

ట్రెండింగ్ వార్తలు