Paytm
Paytm Shares : వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తూ దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా స్టాక్‌మార్కెట్లలోకి అడుగుపెట్టిన వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేటీఎం ఆరంభంలోనే డీలాపడింది. మొత్తం 18వేల 300 కోట్లతో దేశంలో అతిపెద్ద ఐపీఓగా మార్కెట్‌లోకి వచ్చిన పేటీఎం… ఊరించి ఊరించి ఉసూరుమనిపించింది. పేటీఎం ప్రమోటర్లను నమ్మి పెట్టుబడులు పెట్టిన మదుపర్లకు ఫస్ట్ డేనే భారీ షాక్ తగిలింది. వాస్తవానికి ఈ ఐపీఓకు 1.89 రెట్లు అధికంగా బిడ్డింగ్‌లు వచ్చాయి.
Read More : NIA Officials Raids : తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు…దాడులు చేయడం అప్రజాస్వామికం – కళ్యాణ్ రావు
కేవలం భారత్‌లోనే కాదు.. ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో కూడా ఇదే అతిపెద్ద ఐపీఓ. చెప్పుకోవడానికి ఇంత ఘనంగా ఉన్నా… ప్రాక్టికల్‌గా మాత్రం 9 శాతం డిస్కౌంట్‌తో లిస్టింగ్ అయి.. తుస్సుమనిపించింది. ఐపీఓలో ఆఫర్ ప్రైస్ ధర షేర్ 2 వేల 150 రూపాయల ఉంటే… లిస్టు అయిన ధర 19 వందల 55 రూపాయలు. పేటీఎంలో పెట్టుబడి పెట్టిన వాళ్లకు లాభాల సంగతి అలా ఉంచితే… తొలిరోజే 27 శాతానికి పైగా నష్టపోయారు. డీమానిటైజేషన్ టైమ్‌లో డిజిటల్ పేమెంట్స్ కోసమంటూ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది పేటీఎం సంస్థ.
Read More : Indrakeeladri : దుర్గగుడికి జగన్ రూ. 70 కోట్లు ఇచ్చారు..మిగతా సీఎంలు ఇచ్చారా ?
గల్లీలో టీ కొట్టు నుంచి… పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు.. ఎక్కడైనా సరే…ఫిజికల్ నోట్లకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ పేమెంట్స్ మొత్తం పేటీఎంలోనే జరిగే స్థాయికి ఎదిగింది. అయితే గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే వంటి ఆప్షన్స్ కూడా రావడంతో పేటీఎం తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. చివరకు ఐపీఓ పేరుతో భారీగా నిధులు సమీకరించేందుకు అత్యాశకు పోయి ఊహించని హైప్‌ను క్రియేట్ చేసి చివరకు చిన్న ఇన్వెస్టర్ల కొంపముంచుతోంది.