NIA Officials Raids : తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు…దాడులు చేయడం అప్రజాస్వామికం – కళ్యాణ్ రావు

తన నివాసంలో ని ఒక్క బుక్కును కూడా వదలకుండా అన్నింటినీ సోదా చేశారని, అందులో విప్లవ సాహిత్యం కొడవలి గుర్తు ఉన్న అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.

NIA Officials Raids : తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు…దాడులు చేయడం అప్రజాస్వామికం – కళ్యాణ్ రావు

Virasam

NIA Searches : తెలుగు రాష్ట్రాల్లో మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరులు, విరసం నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. రెండు రాష్ట్రాల్లో 14 చోట్ల ఉదయం 5 గంటల నుంచి NIA తనిఖీలు కొనసాగాయి. హైదరాబాద్, రాచకొండ, మెదక్, ప్రకాశం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు ప్రాంతాలలో సోదాలు నిర్వహించినట్లు ఎన్‌ఐఏ ప్రకటించింది. హైదరాబాద్‌ నాగోల్‌లోని రవిశర్మ, అనురాధ ఇళ్లలో సోదా చేశారు. చింతలకుంట ఇంజినీర్స్‌ కాలనీలో టీపీఎఫ్‌ అధ్యక్షుడు రవిచంద్రతో పాటు అల్వాల్‌లోని అమరవీరుల బంధు మిత్రుల సంఘం నేతలు భవాని, పద్మకుమారి నివాసాల్లో సోదాలు నిర్వహించారు.

Read More : Indrakeeladri : దుర్గగుడికి జగన్ రూ. 70 కోట్లు ఇచ్చారు..మిగతా సీఎంలు ఇచ్చారా ?

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో కల్యాణ్‌రావు ఇంట్లో ఎన్‌ఐఏ  అధికారులు సోదా చేశారు. ప్రభుత్వంతో చర్చల సమయంలో కల్యాణ్‌రావు మావోయిస్టుల ప్రతినిధిగా పని చేశారు. ఈ సోదాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, అనుమానస్పద మెటీరియల్, మావోయిస్టు సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. 2019 జూన్‌లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ కేసు దర్యాప్తు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించారు. అప్పటి కూంబింగ్‌ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులతో పాటు ఒక పౌరుడు హతమయ్యాడు. దీనిపై జూన్ 2019లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా 2021 మార్చిలో కేసు టేకప్ చేశారు. సంజు, లక్ష్మణ్, మున్ని, దాసరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. మావోయిస్టులతో సంబంధాలు.. ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురించే అంశంపై ఆరా తీస్తున్నారు. విశాఖపట్నం అరిలోవ కాలనీలో న్యాయవాద దంపతులు శ్రీనివాసరావు, అన్నపూర్ణ ఇళ్లలో కూడా తనిఖీ చేశారు.

Read More : Chandrababu : తిరుపతి వరద బాధితులకు తెలుగుదేశం కేడర్ అండగా నిలవాలి, ఇది ప్రభుత్వ వైఫల్యమే

ఈ సందర్భంగా… విరసం నేత కళ్యాణ్ రావు స్పందించారు. ఆయన 10tvతో మాట్లాడారు. తన నివాసంలో ని ఒక్క బుక్కును కూడా వదలకుండా అన్నింటినీ సోదా చేశారని, అందులో విప్లవ సాహిత్యం కొడవలి గుర్తు ఉన్న అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. రచయితలపై కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ అధికారులతో దాడులు చేయడం అప్రజాస్వామికమంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తూ హక్కులకు అధికారులు భంగం కలిగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యం కాదన్నారు. తనపై గతంలో ఇలాగే దాడులు చేసి 13 కేసులు పెట్టారు..కానీ వాటిలో ఒక్కటి కూడా కోర్టులో రుజువు చేయలేకపోయారని గుర్తు చేశారు. పౌర హక్కులకు భంగం కలిగించే విధంగా కుట్ర జరుగుతోందని, జరుగుతున్న దాడులను ప్రజా సంఘాలన్నీ ఖండించాలని పిలుపునిచ్చారు. దీనిపై ఉద్యమం చేసేందుకు ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కళ్యాణ్ రావు.