Chandrababu : తిరుపతి వరద బాధితులకు తెలుగుదేశం కేడర్ అండగా నిలవాలి, ఇది ప్రభుత్వ వైఫల్యమే

తిరుపతిలో వర్ష బీభత్సంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. భారీ వర్షాలతో నిరాశ్రయులైన తిరుపతి ప్రజలకు పార్టీ కేడర్ అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Chandrababu : తిరుపతి వరద బాధితులకు తెలుగుదేశం కేడర్ అండగా నిలవాలి, ఇది ప్రభుత్వ వైఫల్యమే

Chandrababu

Chandrababu : తిరుపతిలో వర్ష బీభత్సంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. భారీ వర్షాలతో నిరాశ్రయులైన తిరుపతి ప్రజలకు పార్టీ కేడర్ అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. భారీ వర్షాలు, వరదలు చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో అవసరమైన సేవలు అందించాలని చెప్పారు. అధికార యంత్రాంగం సహకారంతో ప్రజలకు అండగా నిలవాలని కేడర్ కు సూచించారు.

తిరుపతి వచ్చి వర్షంలో చిక్కుకుపోయిన భక్తులకు సహాయ, సహకారాలు అందించాలని చంద్రబాబు చెప్పారు. అదే సమయంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం చెందిందని చంద్రబాబు ఆరోపించారు. వరద బాధితులకు యుద్ద ప్రాతిపదికన సహాయ, సహకారాలు అందించాల్సిందిగా ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Kamakshi Plant : కాలేయ వ్యాధుల నుండి కాపాడే కామాక్షి మొక్క

వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు క‌నీసం ప‌ట్టించుకోకుండా, ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌లం అవ‌డం వ‌ల్లే భారీ వ‌ర్షాలతో తిరుప‌తి జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకుందని నారా లోకేష్ అన్నారు. ఇప్ప‌టికైనా ఎన్డీఆర్ఎఫ్‌, ఇత‌ర స‌హాయ‌ బృందాల‌ను పంపించి తిరుప‌తిలో ముంపు ప్రాంత ప్ర‌జ‌లను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాలని ఆయన డిమాండ్ చేశారు. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న భ‌క్తుల‌కు సాయం అందించాలన్నారు. ఎక్క‌డిక‌క్క‌డ ఇరుక్కుపోయిన ప్ర‌యాణికుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేర్చేందుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లోకేష్.

అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు చిత్తూరుని వణికిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కుండపోత వానలతో తిరుపతి విలవిలలాడుతోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలతో తిరుపతి నగరం తడిసి ముద్దవుతోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఆధ్యాత్మిక నగరం చిన్నపాటి వర్షాలకే అస్తవ్యస్థంగా మారుతోందని వాపోతున్నారు.

నగరంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌లు వర్షపు నీటితో మునిగిపోయాయి. తిరుపతి నగరంలోని వెస్ట్‌ చర్చి, తూర్పు పోలీస్‌ స్టేషన్‌ దగ్గరున్న అండర్‌ బ్రిడ్జ్ లు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. నగరంలోని కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Paytm CEO : నెలకు రూ.10వేల జీతమని.. నాకు పిల్లను ఇవ్వనన్నారు : విజయ్ శేఖర్ శర్మ

తిరుమలలోనూ కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలకు తిరుమాడ వీధులు జలమయం అయ్యాయి. కనుమ దారులు, మెట్ల మార్గంలో భారీగా వరద ప్రవహిస్తోంది. భారీ వర్షంతో రెండో కనుమదారి ప్రమాదకరంగా మారింది. మరోవైపు రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. హరిణి సమీపంలో రహదారిపై చెట్టు కూలింది. కొండపై నుంచి రహదారిపైకి మట్టి, రాళ్లు కొట్టుకొచ్చాయి. రెండో కనుమదారిలో వాహనాలు నిలిచిపోయాయి. వైకుంఠ క్యూలైన్లలోని సెల్లార్‌లోకి సైతం వరద నీరు చేరింది.