మదర్ థెరీసా 109వ జయంతి…అందరినీ చిరునవ్వుతో పలకరిద్దామన్న మమత

విదేశంలో పుట్టినా భారత్ కు వచ్చి ఓ అమ్మలా పేదలందరికీ సేవలు చేసి నోబెల్ బహుమతిని సున్నితంగా తిరస్కరించిన భారతరత్న మదర్ థెరీసా 109వ జయంతి. ఈ సందర్భంగా మదర్ థెరీసాను గుర్తుచేసుకుంటూ వెస్ట్ బెంగాల్ లోని అనేకచోట్ల శాంతి ప్రార్థనలు నిర్వహించారు. కోల్ కతాలోని మదర్ హౌస్ లో కూడా శాంతి ప్రార్థనలు జరిగాయి.

ప్రతి ఒక్కరినీ ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిద్దాం,నవ్వు ప్రేమకు పునాది అని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సందర్భంగా మదర్ ధెరీసాను గుర్తుచేసుకున్నారు. ఆమె జయంతి సందర్భంగా  మదర్ థెరిసా (కలకత్తా సెయింట్ థెరీసా) ని ప్రేమగా గుర్తు చేసుకుంటున్నట్లు మమత ట్వీట్ చేశారు.

మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910)న ఆగ్నీస్ గోక్షా బొజాక్షు గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ  పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కలకత్తాలో 1950 లో స్థాపించారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.

మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలురాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు. ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది.