Cold And Snow Delhi : ఢిల్లీపై చలి పంజా, దట్టమైన పొగమంచు.. గజ గజ వణికిపోతున్న ప్రజలు

దేశ రాజధాని ఢిల్లీపై చలి పంజా విసిరింది. ఓవైపు చలి.. మరోవైపు పొగ మంచు కమ్ముకుంది. తీవ్ర చలికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతూవుండటం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. నేటి నుంచి మూడు రోజులు అతి శీతల గాలులు వీచే అవకాశం ఉంది.

cold and snow Delhi : దేశ రాజధాని ఢిల్లీపై చలి పంజా విసిరింది. ఓవైపు చలి.. మరోవైపు పొగ మంచు కమ్ముకుంది. తీవ్ర చలికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతూవుండటం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. నేటి నుంచి మూడు రోజులు అతి శీతల గాలులు వీచే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 2 డిగ్రీలకు పడిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు మరో కోల్డ్ స్పెల్ ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

వరుసుగా కొన్ని రోజులపాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే దానిని కోల్డ్ స్పెల్ గా పిలుస్తారు. ఈ నెల 5 నుంచి 9 తేదీల మధ్య ఏర్పడిన కోల్డ్ స్పెల్ తో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇది రెండోసారి. ఐఎండీ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 15 రోజుల్లో 50 గంటల పాటు పొగమంచు కురిసింది.  2019 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో మంచు కురువడం ఇదే తొలిసారి.

Heavy Snow Fall : జమ్మూకశ్మీర్ లో ముంచుకొచ్చిన మంచు ఉప్పెన

ఈనెల 10 నుంచి క్రమంగా పెరిగిన ఉష్ణోగ్రతలు వాయువ్య ప్రాంతం నుంచి వస్తున్న గాలులతో మరోసారి తగ్గుముఖం పట్టాయి. రానున్న నాలుగు రోజులు ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలి గాలుల వల్ల ఈ నెల 18 వరకు ఆయా ప్రాంతాల్లో 2 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతాయని చెప్పింది.

తాజాగా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకూడదని తెలిపింది. ఇళ్లలో ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసేలా రూమ్ హీటర్లు ఏర్పాటు చేసుకోవాలని కోరింది. ఈ నెల 18 తర్వాత 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు