Petrol Price : మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

నాలుగు రోజులుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోలుపై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగాయి.

Petrol

Petrol and diesel prices : పెట్రో ధరల మంట కొనసాగుతోంది. నాలుగు రోజులుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోలుపై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సరికొత్త రికార్డు సృష్టించాయి.

ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.103.54, డీజిల్‌ ధర 92.17కు పెరిగింది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.109.54, డీజిల్‌ ధర రూ.99.22 పెరిగాయి. చెన్నైలో పెట్రోల్‌ ధర 101.01, డీజిల్‌ ధర 96.60కు చేరుకుంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.104.23, డీజిల్‌ ధర రూ.95.23కు చేరాయి.

Gandhi’s picture: రూ.2వేలు, రూ.5వందల నోట్‌లపై మహాత్మాగాంధీ చిత్రాన్ని తొలగించండి!

హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.107.73, డీజిల్‌ ధర రూ.100.51కి పెరిగింది. నిన్న పెరిగిన ధరలతోనే తెలంగాణలో లీటర్ డీజిల్‌ ధర రూ.100 మార్కును దాటిని విషయం తెలిసిందే.