Today Petrol Prices : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు…లీటర్‌పై ఎంతంటే?

Today Petrol Prices : దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ఒకరోజు తగ్గినట్టే తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.

Petrol And Diesel Prices Today In Hyderabad, Delhi, Chennai, Mumbai Surges

Today Petrol Prices : దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ఒకరోజు తగ్గినట్టే తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. శుక్రవారం విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు సామాన్యులపై మళ్లీ పెట్రోల్ బాదుడు మోపాయి. శనివారం (ఏప్రిల్ 2)న లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 80 పైసలు చొప్పున వడ్డించాయి. గడిచిన 12 రోజుల్లో 10 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 7.20 పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.61 సెంచరీ దాటేయగా.. డీజిల్ ధర మాత్రం 93.87కు పెరిగింది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.116.30 పెరిగింది. అలాగే డీజిల్ ధర రూ.102.43 పెరిగింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.118.20 ఉండగా, డీజిల్ ధర రూ.103.94 పెరగగా, ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.57 పెరిగింది. డీజిల్ ధర లీటర్ రూ. 101.79 పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.21 పెరగగా, డీజిల్ ధర రూ. 98.28కు పెరిగింది.

Petrol And Diesel Prices Today In Hyderabad, Delhi, Chennai, Mumbai Surges

కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.19 పెరగగా, డీజిల్ ధర రూ.97.02కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. విదేశాల నుంచి భారత్ 85 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది.

ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు 80 పైసలు పెరిగాయి. మార్చి 22 తర్వాత పదోసారి ఇంధన ధరలు పెరిగాయి. వాహనదారులకు ఊరటనిచ్చిన కంపెనీలు.. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచేశాయి. 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధరను రూ.250 వరకు పెంచేశాయి. సిలిండర్‌ ధర రూ. 2,253కు చేరింది. డొమెస్టిక్ సిలిండర్ 14.2 కిలోల వంట గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను సవరించలేదు.

Read Also : Petrol Price Hike: పెట్రో బాంబ్.. మరోసారి పెరిగిన ధరలు!