Petrol Prices Today : పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి.. ఒకే నెలలో ఏడోసారి..!

ఇంధన ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాహనదారులకు ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. జూలై నెలలో వరుసగా ఏడోసారి ఇంధన ధరలు పెరిగాయి.

Petrol, diesel prices hiked for seventh : ఇంధన ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకరోజు తగ్గినట్టే తగ్గి  వాహనదారులకు ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడమే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగదలకు కారణమని ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం, రాష్ట్రాలు వేసే పన్నులతో పెట్రోల్, డీజిల్ ధరల భారం సామాన్యులపై పడుతోంది. కోవిడ్ సంక్షోభ సమయంలో లీటర్ పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ దాటి దూసుకెళుతున్నాయి. జూలై నెలలో వరుసగా ఏడోసారి ఇంధన ధరలు పెరిగాయి. శనివారం (జూన్ 10)న చాలా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ 35 పైసలు పెరిగింది.. ఇక డీజిల్ 26 పైసలు పెరిగింది.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.91గా ఉంది. డీజిల్ ధర కూడా 89.88లుగా ఉంది. భారత ఆర్థిక నగరమైన ముంబైలో పెట్రోల్ లీటర్ ధర రూ.106.93 ఉండగా.. డీజిల్ ధర లీటర్ కు రూ.97.46లకు చేరింది. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో ఇంధన ధరలు 100 మార్క్ దాటేశాయి. మే నెలలో భూపాల్ పెట్రోల్ ధర 100 దాటిన మొదటి నగరంగా నిలిచింది. ఆ తర్వాత జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు స్థానాల్లో నిలిచాయి. దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, జమ్ముకశ్మీర్, ఒడిసా, లడఖ్, బీహార్, కేరళ, తమిళనాడు, పంజాబ్, సిక్కిం, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, నాగాలాండ్ లలో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ఇక డీజిల్ ధర కొన్ని ప్రాంతాల్లో సెంచరీకి చేరువలో ఉంది.

ఆంధ్ర‌ప్రదేశ్‌లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ఢిల్లీ సహా ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లో లీటర్‌ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటింది. భూపాల్ లో ప్రస్తుతం పెట్రోల్‌ ధర రూ.109.24, డీజిల్‌ ధర రూ.98.67 చేరుకుంది. బెంగళూరులో పెట్రోల్‌ ధర రూ.104.29 కాగా.. డీజిల్‌ ధర రూ.95.26కు చేరుకుంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.101.01గా ఉండగా.. డీజిల్‌ ధరరూ.92.97గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.67 కాగా.. డీజిల్‌ ధర రూ.94.39కు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 104.86గా ఉంది. డీజిల్‌ ధర రూ.97.96కు చేరింది. కరీంనగర్‌లో పెట్రోల్‌ ధర రూ. 105.37గా ఉంటే.. డీజిల్ ధర రూ.98.42గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర 107.07 ఉంటే.. డీజిల్‌ ధర రూ.99.60కు చేరుకుంది. విశాఖలో పెట్రోల్ ధర రూ.106.64గా ఉంటే.. డీజిల్‌ ధర రూ.99.15కు చేరింది.

ట్రెండింగ్ వార్తలు