India Petrol Price : హడలెత్తిస్తున్న పెట్రో ధరలు, హైదరాబాద్‌లో లీటర్ రూ. 109

రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. డీజిల్ ధరలు సెంచరీ దాటుతోంది. పెట్రోల్ ధరలు చెప్పనక్కర్లేదు.

Petrol Price India : పెట్రోల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి ? అంటూ సామాన్యుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. డీజిల్ ధరలు సెంచరీ దాటుతోంది. పెట్రోల్ ధరలు చెప్పనక్కర్లేదు. వంద దాటి పోతోంది. దీంతో పెట్రోల్ పోయించుకోవాలంటే బెంబేలెత్తిపోతున్నారు. లీటర్ పెట్రోల్ రూ. 100 దాటితే..తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెట్రో ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 104.79, డీజిల్ రూ. 93.52 కి చేరుకుంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 109.00, డీజిల్ రూ. 102.04గా ఉంది.

Read More : Microsoft : ఏపిలో నైపుణ్య శిక్షణకు మైక్రోసాఫ్ట్… శిక్షణ పొందనున్న 1.62లక్షల విద్యార్ధులు

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ లీటర్ పెట్రోల్ రూ. 104.79. లీటర్ డీజిల్ రూ. 93.52
కోల్ కతా లీటర్ పెట్రోల్ రూ. 105.43. లీటర్ డీజిల్ రూ.96.63
ముంబాయి లీటర్ పెట్రోల్ రూ. 110.75. లీటర్ డీజిల్ రూ. 101.40
చెన్నై లీటర్ పెట్రోల్ రూ. 102.10 లీటర్ డీజిల్ రూ. 97.93

Read More :Allu Arjun : మరోసారి అల్లు అర్జున్ బోయపాటి మాస్ కాంబినేషన్.. పుష్ప తర్వాతే??

గుర్ గావ్ లీటర్ పెట్రోల్ రూ. 102.10 లీటర్ డీజిల్ రూ. 93.93
నోయిడా లీటర్ పెట్రోల్ రూ. 101.84 లీటర్ డీజిల్ రూ. 93.97
బెంగళూరు లీటర్ పెట్రోల్ రూ. 108.44 లీటర్ డీజిల్ రూ. 99.26
భువనేశ్వర్ లీటర్ పెట్రోల్ రూ. 106.06 లీటర్ డీజిల్ రూ. 102.33
చండీఘడ్ లీటర్ పెట్రోల్ రూ. 100.86 లీటర్ డీజిల్ రూ. 93.24

Read More : Agnes Tirop : కెన్యా అథ్లెట్‌ అగ్నెస్‌ అనుమానాస్పద మృతి

హైదరాబాద్ లీటర్ పెట్రోల్ రూ. 109.00 లీటర్ డీజిల్ రూ. 102.04
విజయవాడ లీటర్ పెట్రోల్ రూ. 111.48 లీటర్ డీజిల్ రూ. 103.88
విశాఖపట్టణం లీటర్ పెట్రోల్ రూ. 110.18 లీటర్ డీజిల్ రూ. 102.65
జైపూర్ లీటర్ పెట్రోల్ రూ. 112.06 లీటర్ డీజిల్ రూ. 103.20

ట్రెండింగ్ వార్తలు