Petrol Prices : మళ్లీ పెరిగిన చమురు ధరలు, హైదరాబాద్‌‌లో పెట్రోల్ లీటర్ రూ. 96.88

దేశ వ్యాప్తంగా..రికార్డు స్థాయికి చేరుకున్నట్లైంది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌పై 13 నుంచి 29 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెరిగింది.

Petrol, Diesel Price : చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. చమురు కంపెనీలు మరోసారి ధరలు పెంచాయి. శనివారం ధరలు పెరగలేదు. కానీ..2021, మే 23వ తేదీ ఆదివారం ధరలు పెంచుతూ..నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా..రికార్డు స్థాయికి చేరుకున్నట్లైంది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌పై 13 నుంచి 29 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెరిగింది.

మే నెలలో ధరలు పెరగడం 12వ సారి. మొత్తంగా తాజాగా పెరిగిన ధరలతో దేశ వాణిజ్య రాజధాని ముంబైలో రూ. 100కు దగ్గరైంది. లీటర్ పెట్రోల్ రూ. 99.49 పైసలు, డీజిల్ ధర రూ. 91.30 పైసలకు చేరుకుంది. హైదరబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 96.88, డీజిల్ రూ. 91.65 చేరుకుంది. వ్యాట్ తదితర కారణాల వల్ల చమురు ధరల్లో తేడాలు ఉంటాయి.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌..తదితర కొన్ని నగరాల్లో పెట్రోల్‌ లీటర్‌ వంద రూపాయలకు చేరుకుంది. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ .11.80 వసూలు చేస్తోంది.

ఇతర ప్రాంతాల్లో ధరలు : –
* హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.96.88, డీజిల్‌ రూ.91.65
* చెన్నైలో పెట్రోల్‌ రూ.94.86, డీజిల్‌ రూ.88.87
* తిరువనంతపురం పెట్రోల్‌ రూ.95.19, డీజిల్‌ రూ.90.36

* కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.93.27, డీజిల్‌ రూ.86.91
* జైపూర్‌లో పెట్రోల్‌ రూ.99.68, డీజిల్‌ రూ.91.65
* బెంగళూరులో పెట్రోల్‌ రూ.96.31, డీజిల్‌ రూ.89.12

Read More :  Raviteja-Boyapati Combination: బోయపాటితో మాస్ రాజా.. భద్ర రిపీట్ చేస్తారా?

ట్రెండింగ్ వార్తలు