India : స్థిరంగా పెట్రో ధరలు, తెలుగు రాష్ట్రాలు తగ్గించరా

కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

Petrol Rate

Petrol Rate India : భారతదేశ వ్యాప్తంగా చమురు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే..కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. ఇప్పటికే కేంద్రం తగ్గింపుతో పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 11 రూపాయల మేర ధరలు దిగి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌లు పెరుగుతున్నాయి.

Read More : Just missed: ప్రధానికి తృటిలో తప్పిన ప్రమాదం

నగరంలో ధరలు :-

– ఢిల్లీలో పెట్రోల్‌ రూ.103.97.. డీజిల్‌ రూ.86.67
– ముంబైలో పెట్రోల్‌ రూ.109.98. డీజిల్‌ రూ.89.79
– చెన్నైలో పెట్రోల్‌ రూ.101.40.. డీజిల్‌ రూ.91.43
– గుర్ గావ్ లో పెట్రోల్‌ రూ.95.52.. డీజిల్‌ రూ.86.74

Read More : TSRTC : తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్, త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ?

– నోయిడాలో పెట్రోల్‌ రూ.95.47.. డీజిల్‌ రూ.86.98
– బెంగళూరులో పెట్రోల్‌ రూ.100.58.. డీజిల్‌ రూ.85.01
– భువనేశ్వర్ పెట్రోల్‌ రూ.102.10.. డీజిల్‌ రూ.91.91

Read More : Telangana Wine Shops: వైన్ షాపులకు టెండర్లు షురూ!

–  చండీఘడ్ పెట్రోల్‌ రూ.94.23.. డీజిల్‌ రూ.80.90
– హైదరాబాద్ లో పెట్రోల్‌ రూ.108.20.. డీజిల్‌ రూ.94.62
– జైపూర్ లో పెట్రోల్‌ రూ.111.33.. డీజిల్‌ రూ 95.91
– విజయవాడలో రూ.110.15 డీజిల్‌ రూ.96.23