TSRTC : తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్, త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ?

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు.. రోజురోజుకు పెరుగుతున్న వంటగ్యాస్‌కు తోడు... ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీల భారం పడనుంది.

TSRTC : తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్, త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ?

TSRtc Md

Hike Bus Fares : తెలంగాణ ప్రజలకు మరో షాక్‌ తగలనుంది.. ఓ వైపు ఆకాశాన్నంటేలా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు.. రోజురోజుకు పెరుగుతున్న వంటగ్యాస్‌కు తోడు… ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీల భారం పడనుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఛార్జీల పెంపు ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై తెలంగాణ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోబోతుంది… కిలోమీటరుకు 10 పైసల నుంచి 25 పైసలు పెంచాలనే ఆలోచనలో ఉంది తెలంగాణ ఆర్టీసీ. పెరిగిన డీజిల్‌ భారం నుంచి బయట పడాలంటే చార్జీలు స్వల్పంగా పెంచడం తప్పదంటోంది ఆర్టీసీ యాజమాన్యం.

Read More : BJP : మేధోమథనం..బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగ్

ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారులు నేరుగా సీఎంకు పరిస్థితిని వివరించారు. వచ్చే కేబినెట్ మీటింగ్‌లోగా ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో ఏ మేర పెంచితే.. ఎంత మేర నష్టం భర్తీ అవుతుందనే అంశం పైన సీఎంఓకు రిపోర్ట్ ఇచ్చారు ఆర్టీసీ అధికారులు. రెండు రోజుల్లో ఈ ఫైల్‌ సీఎం కేసీఆర్‌ వద్దకు చేరుకోనుంది. ఆ తర్వాత కేబినెట్‌లో చర్చించి ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు.

Read More : Father Decorates Hospital: డెంగ్యూతో హాస్పిటల్ లో చేరిన కూతురి కోసం తండ్రి డెకరేషన్

తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో ఉంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చేందుకు చాలా ఇబ్బందులు పడుతోంది. దీనికి కరోనా కష్టాలు కూడా తోడయ్యాయి. రెండేళ్లలో 30 శాతం డీజిల్ ధరలు పెరగడంతో.. చార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. దీనిపై.. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.