BJP : మేధోమథనం..బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగ్
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Bjp Meeting
BJP National Executive Meeting : భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు చేపట్టాక తొలి భేటీ ఇది. ఈ భేటీలో ఉత్తర ప్రదేశ్ సహా ఎన్నికలు జరిగే ఏడు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టనున్నారు.
Read More : Father Decorates Hospital: డెంగ్యూతో హాస్పిటల్ లో చేరిన కూతురి కోసం దీపాలతో డెకరేట్ చేసిన తండ్రి
వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో వచ్చే ఏడాది ఆఖర్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ ఏడు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ కార్యవర్గ సమావేశంలో మేధోమథనం నిర్వహించనున్నారు.
Read More : Anushka Shetty : ప్రభాస్ నిర్మాణంలో అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీ.. బర్త్ డే స్పెషల్ గిఫ్ట్
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇటీవలే ఉప ఎన్నికలు జరిగాయి… ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ అంశంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సమావేశానికి అతితక్కువ మందే నేరుగా హాజరవగా.. ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలంతా వర్చువల్ విధానంలో పాల్గొంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో ప్రారంభమయ్యే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగియనుంది.
తెలంగాణ నుండి ఈ కార్యవర్గ సమావేశానికి వర్చువల్ లో రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొననున్నారు. రాష్ట్రం నుండి బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి ఈటల రాజేందర్, రాజా సింగ్, విజయ శాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటిలు పాల్గొననున్నారు. నేరుగా జాతీయ కార్యవర్గ సమావేశం లో డీకే అరుణ, లక్ష్మణ్, మురళి ధర్ రావులు పాల్గొననున్నారు.