Anushka Shetty : ప్రభాస్ నిర్మాణంలో అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీ.. బర్త్ డే స్పెషల్ గిఫ్ట్

ఇవాళ అనుష్క బర్త్ డే సందర్భంగా తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనుష్కకి ఇది 48వ సినిమా. ఈ సినిమాని ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది

Anushka Shetty : ప్రభాస్ నిర్మాణంలో అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీ.. బర్త్ డే స్పెషల్ గిఫ్ట్

Anushka

Anushka Shetty :  ఒక కమర్షియల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన హీరోయిన్ అనుష్క. ఒకపక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘పంచాక్షరి’, ‘సైజ్ జీరో’… లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా తీసి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల అనుష్క చాలా స్లోగా సినిమాలు చేస్తుంది. ‘బాహుబలి’ సినిమా తర్వాత ‘నిశ్శబ్దం’ అనే ఒక సినిమాలో నటించింది. మళ్ళీ ఇప్పటిదాకా అనుష్క నుంచి ఒక్క ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ కాలేదు.

Food Delivery : స్విగ్గిలో ఫుడ్ లేట్ గా వచ్చినందుకు మోడీకి, మమతా బెనర్జీకి ట్విట్టర్లో కంప్లైంట్ చేసిన స్టార్ హీరో

ఇవాళ అనుష్క బర్త్ డే సందర్భంగా తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనుష్కకి ఇది 48వ సినిమా. ఈ సినిమాని ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. కొత్త డైరెక్టర్ మహేష్ బాబు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఓ ఎంటర్టైన్మెంట్ కథతో ఈ సినిమా రాబోతుంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ అనుష్క పుట్టిన రోజూ సందర్భంగా అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

Puneeth Rajkumar : పునీత్ సమాధి వద్ద పెళ్లి చేసుకునేందుకు వచ్చిన ప్రేమ జంట.. అడ్డుకున్న పోలీసులు

గతంలో అనుష్క యూవీ క్రియేషన్స్ లో ‘మిర్చి’, ‘భాగమతి’ సినిమాలను చేసింది. ఇప్పుడు మూడో సినిమాతో వీళ్ళ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క సినిమా అనౌన్స్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.