Food Delivery : స్విగ్గిలో ఫుడ్ లేట్ గా వచ్చినందుకు మోడీకి, మమతా బెనర్జీకి ట్విట్టర్లో కంప్లైంట్ చేసిన స్టార్ హీరో

స్విగ్గిలో ఫుడ్ లేట్ గా వచ్చినందుకు ఏకంగా పీఎం మోడీకి, మమతా బెనర్జీకి ట్విట్టర్లో కంప్లైంట్ చేశారు. అయితే ఈ కంప్లైంట్ చేసింది సాధారణ ప్రజలు కాదు ఓ స్టార్ హీరో.

Food Delivery : స్విగ్గిలో ఫుడ్ లేట్ గా వచ్చినందుకు మోడీకి, మమతా బెనర్జీకి ట్విట్టర్లో కంప్లైంట్ చేసిన స్టార్ హీరో

Prasen

Food Delivery :  ఈ మధ్య అందరు ఫుడ్ ఆన్లైన్లోనే ఆర్డర్ ఇస్తున్నారు. మనకి ఆకలిగా ఉన్నప్పుడు ఫుడ్ రావటం లేట్ అయితే మనకి చాలా కోపం వస్తుంది. ఆ ఫుడ్ యాప్ వాడ్ని తిట్టుకోవడమో, కస్టమర్ కేర్ కి కాల్ చేసి చెప్పడమో చేస్తూ ఉంటాం. కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళ యాప్స్ ని ట్యాగ్ చేస్తూ కంప్లైంట్ కూడా చేస్తారు. తాజాగా స్విగ్గిలో ఫుడ్ లేట్ గా వచ్చినందుకు ఏకంగా పీఎం మోడీకి, మమతా బెనర్జీకి ట్విట్టర్లో కంప్లైంట్ చేశారు. అయితే ఈ కంప్లైంట్ చేసింది సాధారణ ప్రజలు కాదు ఓ స్టార్ హీరో.

Puneeth Rajkumar : పునీత్ సమాధి వద్ద పెళ్లి చేసుకునేందుకు వచ్చిన ప్రేమ జంట.. అడ్డుకున్న పోలీసులు

బెంగాలీ స్టార్ హీరో ప్రసేన్‌జిత్ ఛటర్జీ స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేసాడు. అయితే ఆ ఫుడ్ చాలా లేట్ గా వచ్చిందట. దీనికి ప్రసేన్ కి కోపం వచ్చి.. తమ రాత్రి భోజనం కోసం ఎవరైనా ఇటువంటి యాప్స్‌పై ఆధారపడితే, వారి గతేంటి? పస్తులుండాల్సిందేనా? దీనిపై కాస్త దృష్టి పెట్టండి అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసి పీఎం మోడీని, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ట్యాగ్ చేశారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో ఎవరు హీరో ? ఎవరు విలన్?

కొంతమంది ఇది నిజంగా పెద్ద సమస్యే, మాకు కూడా చాలా సార్లు ఎదురయింది ఈ సమస్య. ఫుడ్ యాప్స్ ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇంత చిన్న సమస్యకి పీఎంని, సీఎంని ట్యాగ్ చేయాలా? వాళ్ళు ఇలాంటి సమస్యలు తీర్చడానికి ఖాళీగా ఉన్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఓ స్టార్ హీరో ఇలాంటి చిన్న విషయానికి పీఎం, సీఎంని ట్యాగ్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.