Father Decorates Hospital: డెంగ్యూతో హాస్పిటల్ లో చేరిన కూతురి కోసం తండ్రి డెకరేషన్

పండుగకు ఇంటికి వచ్చిన వారి మాట అటుంచితే ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తే ఎలా.. అందుకే ఆమె ఉండే హాస్పిటల్ లో పండుగ వాతావరణం కనిపించాలనుకున్నాడు తండ్రి. ఈ మేరకు హాస్పిటల్...

Father Decorates Hospital: డెంగ్యూతో హాస్పిటల్ లో చేరిన కూతురి కోసం తండ్రి డెకరేషన్

Hospital Decoration

Father Decorates Hospital: దేశవ్యాప్తంగా దీపావళి సెలబ్రేషన్స్ మార్మోగిపోయాయి. దీపాలతో పండుగను కోలాహలంగా జరుపుకున్నారు. పండుగకు ఇంటికి వచ్చిన వారి మాట అటుంచితే ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తే ఎలా.. అందుకే ఆమె ఉండే హాస్పిటల్ లో పండుగ వాతావరణం కనిపించాలనుకున్నాడు తండ్రి. ఈ మేరకు హాస్పిటల్ గది మొత్తాన్ని దీపాలతో డెకరేట్ చేసేశాడు.

అతని ఆలోచనలకు.. కూతురు కోసం చేసిన పనులకు ఫ్యాన్స్ అయిపోతున్నారు తెలిసిన వాళ్లంతా.. కూతురు డెంగ్యూతో హాస్పిటల్ పాలైనప్పటికీ ఆమెలో ఆ గది తాలూకు ఆందోళన నుంచి బయటపడేయాలనుకున్నాడు. అలా చేయడంతో తన కూతురుపడిన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు కూడా.

కూతురి డెంగ్యూతో బాధపడుతూ హాస్పిటల్ లో ఉందని అది కూడా డెకరేట్ చేసేశాం. హ్యాపీ దివాలీ అంటూ క్యాప్షన్ రాశాడు ఆ తండ్రి. గుర్తు పెట్టుకోండి చిన్నపాటి సంతోషాలు చాలా ఇవ్వగలవు అని అతని అద్భుతమైన ఆలోచనను కళ్ల ముందుంచాడు. తండ్రి చేసిన పనికి కాంప్లిమెంట్స్ ఇస్తూనే కూతురు త్వరగా కోలుకోవాలంటూ విషెస్ తెలియజేస్తున్నారు నెటిజన్లు.

 

…………………………………………… : జుట్టు రాలకుండా ఓత్తుగా పెరగాలంటే?..