Castor Oil : జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలంటే?..

ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమం చాలా మంచిది. వీటిల్లో ఉండే యాంటీమైక్రోబియల్ లక్షణాలు తల మాడుపై వచ్చిన ఇన్ఫెక్షన్ ను నయం చేసి, జుట్టు ఊడిపోవటాన్ని తగ్గిస్తాయి.

Castor Oil : జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలంటే?..

Castor Oil

Castor Oil : ఆముదం నూనెను జుట్టు పెరగటానికి చాలా మంది నేటికి వాడుతున్నారు. పూర్వకాలంలో ఆముదం నూనెను జుట్టుతోపాటు సౌందర్య సాధనాల్లో విరివిగా వినియోగించేవారు. అయితే రానురాను ఆముదం నూనె వాడకం తగ్గిపోయింది. ఎందుకంటే జిడ్డు అధికంగా ఉండే ఆముదం నూనెలను ఉపయోగించేందుకు చాలా మంది ఇష్టపడటంలేదు. దీంతోపాటు మార్కెట్లోకి వివిధ రకాల హెయిర్ ఆయిల్స్ అందుబాటులోకి రావటంతో వాటిని వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాస్తవానికి జుట్టు బాగా పెరగాలన్నా,..వెంట్రుకలు ఊడిపోకుండా ఉండాలన్నా ఆముదం నూనె బాగా పనిచేస్తుంది.

ఆముదం నూనెను నేరుగా జుట్టుపై రాసేసి, మసాజ్ చేయండి. ఆముదం నూనెతో మర్దన చేయటం వలన రక్తప్రసరణ మెరుగవుతుంది. దీంతోపాటు మీ జుట్టు అందం కూడా పెరుగుతుంది. ఈ నూనె తల కుదుళ్ళలోకి బాగా ఇంకి, జుట్టు మూలం వరకు వెళ్ళి జుట్టు వేగంగా పెరిగేలా, ఊడిపోకుండా చేస్తుంది. ఆముదంలో బ్యాక్టీరియా, ఫంగల్ వ్యతిరేక లక్షణాలు, విటమిన్ ఇ, ఖనిజలవణాలు, ఒమేగా 6, 9 ఫ్యాటీయాసిడ్లు, ప్రొటీన్లు ఉండటం వలన జుట్టు రాలటాన్ని అరికట్టడంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఒక స్పూన్ ఆముదం నూనెలో ఒక స్పూన్ ఆవనూనె కలిపి తలకు పట్టించి 5 నిముషాలు మసాజ్ చేసి గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలటం తగ్గిపోతుంది. ఒక స్పూన్ ఆముదంలో ఒక స్పూన్ బాదాం నూనెను కలిపి జుట్టుకు పట్టించి 5 నిముషాలు మసాజ్ చేసి అరగంట తర్వాత తెలిపాయి షాంపూతో తలస్నానము చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. బాదాం నూనె పాడయిన జుట్టును రిపేర్ చేయటంలో బాగా పనిచేస్తుంది.

ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమం చాలా మంచిది. వీటిల్లో ఉండే యాంటీమైక్రోబియల్ లక్షణాలు తల మాడుపై వచ్చిన ఇన్ఫెక్షన్ ను నయం చేసి, జుట్టు ఊడిపోవటాన్ని తగ్గిస్తాయి. ఒక బౌల్ లో ఒక చెంచా ఆముదం నూనె, ఒక చెంచా కొబ్బరినూనెను వేయండి. బాగా కలిపి మీ జుట్టుకు మసాజ్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి రాసి 2 నుండి 3 గంటలు అలానే వదిలేయండి. తరువాత షాంపుతో తలస్నానం చేయండి ఇలా చేస్తే జుట్టు ఊడటం తగ్గిపోతుంది.

ఈ మధ్య కాలంలో చాలామందికి ఉన్న పెద్ద సమస్య జుట్టు చివర విరిగిపోతుంటాయి ఈ సమస్య ఉన్నవాళ్లు జుట్టు సమానంగా కనిపించడానికి తరుచూ హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఈ సమస్యను అధిగమించడానికి ఆముదం నూనె మరియు కోడి గుడ్డు తో చక్కని పరిష్కారం ఉంది ఈ చిట్కాని వారానికి ఒకసారి కచ్చితంగా సక్రమంగా పాటిస్తే మృదువైన చక్కని ఒత్తైన జుట్టు ని పొందవచ్చు.1 చెంచా ఆముదం నూనె, 1 గుడ్డు, 2 చెంచాల కొబ్బరి నూనె తీసుకోవాలి. గుడ్డు తీసుకొని అందులో 1 చెంచా కొబ్బరి నూనె మరియు 1 చెంచా ఆముదం నూనె వేసి బాగా కలపండి, వచ్చిన మిశ్రమాన్ని మీ జుట్టుకు బాగా పట్టించి కనీసం 30 నిమిషాలు ఉంచిన తర్వాత షాంపుతో తలస్నానం చేయండి వారానికి ఒకసారి ఇలా చేస్తే సమస్యనుండి బయటపడవచ్చు.

జుట్టు బలంగా పెరగడానికి ముఖ్యంగా కావలసిన విటమిన్ e, ఇది జుట్టుకు రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది, అందువల్ల జుట్టు త్వరగా పెరుగుతుంది. ఇది నెత్తిమీద చర్మం మీద పనిచేస్తుంది మరియు అవసరమైన పోషకాల సహాయంతో మూలాలను బలపరుస్తుంది.1 చెంచా ఆలివ్ ఆయిల్, 1 చెంచా బాదం ఆయిల్, 1 చెంచా కొబ్బరి నూనే, 2 విటమిన్ ఈ టాబ్లెట్లు, ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్, కొబ్బరి నూనే సమపాళ్లలో తీసుకొని ఇందులో విటమిన్ ఈ టాబ్లెట్ వేసి బాగా కలపండి, వచ్చిన మిశ్రమాన్ని మీ జుట్టుకు ఒక రాత్రంతా బాగా పట్టించి మర్నాడు ఉదయమే షాంపుతో తలస్నానం చేయండి వారానికి కనీసం రెండు మూడు సార్లు ఈ పద్ధతిని పాటించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.