Raj Thackeray
Pune PFI Protest: పూణేలో ఎన్ఐఏ, ఈడీ దాడులకు వ్యతిరేకంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకర్తలు నిర్వహించిన నిరసనల సందర్భంగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. పాక్ కు అనుకూలంగా నినాదాలు చేసిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అన్నారు. పాక్ అనుకూల నినాదాలు చేసిన వారిపై ప్రభుత్వం వేగంగా కఠినంగా శిక్షించాలి. ఎవరైనా అలా ధైర్యంచేసి, ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే ఇది మహారాష్ట్రలో పెద్ద శాంతిభద్రత వైఫల్యం అని థాకరే అన్నారు.
పూణెలో జరిగిన పీఎఫ్‌ఐ నిరసన సందర్భంగా ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేసినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కొన్ని వీడియోలను ఒక వర్గం మీడియా కూడా ప్రసారం చేసింది. అయితే, పాకిస్తాన్ అనుకూల నినాదాలు లేవనెత్తారా లేదా అనేది వీడియోలో స్పష్టంగా లేదు. ఈ మేరకు రాజ్‌ఠాక్రే ట్వీట్ చేశారు.. హిందువులు, మరాఠీలు ఈ విషయాన్ని తమ చేతుల్లో తీసుకుంటే.. అప్పుడు ఆ దుష్టులంతా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారని ప్రశ్నించారు. ఇదే అదే జరిగితే పండుగల సమయంలో అశాంతి నెలకొంటుందని, తనను రెచ్చగొట్టద్దంటూ సూచించారు. ఈ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వెంటనే స్వస్తి పలికితే బాగుంటుందని హితవు పలికారు. పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తే హిందువులు మౌనంగా ఉండరని ట్వీట్ చేస్తూ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లను ట్యాగ్ చేశారు.
If slogans such as ‘Pakistan Zindabad’ ‘ Allahu Akbar’ are going to be proclaimed in our Pune city, then our country’s Hindus are not going to keep quiet.
Rather, it’s better to urgently put an end to this disease of anti-national elements.@AmitShah @Dev_Fadnavis pic.twitter.com/pdpqZQFBqc
— Raj Thackeray (@RajThackeray) September 24, 2022
దేశ వ్యతిరేకత అంశాలతో కూడిన ఈ వ్యాధిని వెంటనే నిర్మూలించడం మంచిదన్న రాజ్‌ఠాక్రే.. ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ముగింపు పలకడం మంచిదని సూచించారు. పాక్ అనుకూల నినాదాలు చేసే మానసిక స్థితి ఉన్నవారు.. వారి మతాన్ని పట్టుకుని పాక్‌కు వెళ్లిపోవాలని, ఇలాంటి డ్రామాలను దేశంలో అనుమతించబోమని స్పష్టం చేశారు.