West Bengal Elections 2021 : పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న పోలింగ్

పశ్చిమ బెంగాల్‌లో ఏడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తంగా 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది.

West Bengal Elections 2021 : పశ్చిమ బెంగాల్‌లో ఏడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తంగా 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఏడో దశ ఎన్నికల్లో 284 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 86 లక్షలమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12,068 పోలింగ్ బూత్‌లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.

ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. చివరి విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ఎన్నికలు జరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోని ఎన్నికలు నిర్వహిస్తోంది. ఏడో విడత ఎన్నికలు మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్నాయి.


అందులో మమతా బెనర్జీ ప్రస్తుత నియోజకవర్గం భవానిపూర్‌ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈ ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. సాయంత్రం 6.30గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కోవిడ్ పేషెంట్లు చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. బీజేపీ, టీఎంసీ పార్టీలు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్, వాపపక్ష కూటమి గట్టి పోటీనిస్తోంది. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు మే 2న వెల్లడించే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు