Jaipur : 1860 నాటి కెమెరాతో ఫోటోలు తీస్తున్న జైపూర్ ఫోటోగ్రాఫర్

ఇప్పుడంటే సెల్ ఫోన్‌తో ఎలా కావాలంటే అలా ఎవరికి వారు ఫోటోలు దిగుతున్నారు. ఒకప్పుడు ఫోటోలు తీయించుకుని వాటిని చేతికి అందుకుని చూసుకునేసరికి చాలా సమయం పట్టేది. వాటిని అపురూపంగా కూడా చూసుకునేవారు. 1860 ల నాటి కెమెరాతో జైపూర్‌లో ఒక ఫోటోగ్రాఫర్ ఇప్పటికీ ఫోటోలు తీస్తున్నాడు. అతని వద్దకు ఎంతో ఇష్టంగా వెళ్లి ఫోటోలు దిగే టూరిస్టులు ఉన్నారు.

Jaipur

Jaipur : ఇప్పుడంతా డిజిటల్ యుగం. మొబైల్ ఫోన్‌లలో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు స్టూడియోలకు వెళ్లి ఫోటోలు తీయించుకోవడం వాటిని భద్రపరుచుకోవడం .. అప్పుడప్పుడు వాటిని బయటకు తీసి చూసుకోవడం ఒక గొప్ప అనుభూతి. ఇప్పటికీ పాతకాలం కెమెరాతో ఫోటోలు తీస్తున్నాడు ఓ ఫోటోగ్రాఫర్. జైపూర్ హవామహల్ బయట ఎంతోమంది టూరిస్టులు అతని కెమెరాతో ఫోటోలు తీయించుకుంటారు. బ్లాక్ అండ్ వైట్‌లో తమ చిత్రాలను చూసుకుని మురిసిపోతుంటారు. అతను ఫోటోలు తీసే కెమెరా ఇప్పటిది కాదు మరి. 1860 ల నాటి కెమెరా.

Zinnia Flower : అంతరిక్షంలో పూసిన ‘జిన్నియా’ ఫ్లవర్.. ఫోటో షేర్ చేసిన నాసా

టికామ్ చంద్ అనే ఫోటోగ్రాఫర్ జైపూర్ హవా మహల్ బయట తన పాతకాలపు కెమెరాతో పర్యాటకులకు ఫోటోలు తీస్తుంటాడు. అతను చెప్పే దాని ప్రకారం ఈ కెమెరాను జైపూర్ మహారాజు తన పూర్వీకుడు పహారీ లాల్‌కు బహుమతిగా ఇచ్చాడు. పహారీ లాల్ రాజు అధికారిక ఫోటోగ్రాఫర్ అట. అతని దగ్గర నుంచి తమవరకూ ఈ కెమెరా వచ్చిందని టికామ్ చంద్ చెబుతాడు. ఈ కెమెరాను ఎలా ఆపరేట్ చేస్తారో చూపించే వీడియోను మరూఫ్ ఉమర్ (maroofculmen) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశాడు. ‘ఈ కెమెరా అప్పుడప్పుడు పాడవుతుంటుంది.. ఇది ప్రపంచంలోనే చివరిది. ఈ కెమెరాలో ప్రతి నట్, బోల్ట్ గురించి టికామ్ ‌చంద్‌జీకి మాత్రమే బాగా తెలుసు. కెమెరాలో డార్క్ రూమ్, ఫిక్సర్, డెవలపర్, ఫిల్మ్ బాక్స్ అన్నీ 20 కిలోల బరువు ఉంటాయి’ అంటూ దీని గురించి మరూఫ్ పేర్కొన్నారు.

Anand Mahindra : 7 సంవత్సరాల క్రితం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలో చిన్నారి.. ఇప్పుడు డైరెక్ట్‌గా ఆయనను కలిసింది

ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘ఫోటోలు ఎంత క్వాలిటీగా అద్భుతంగా ఉన్నాయి’ అంటూ ఒకరు.. ‘రెండు వారాల క్రితం అక్కడి వెళ్లి ఫోటో దిగాము.. కెమెరా పనితనాన్ని మాకు టికామ్ చంద్ చక్కగా వివరించాడని’ మరొకరు కామెంట్లు చేశారు. ఎప్పుడైనా జైపూర్ వెళ్లిన వాళ్లు హవామహల్ దగ్గరకి వెళ్లడం మర్చిపోకండి.  టికామ్ చంద్ కెమెరాలో ఫోటోలు దిగడం మర్చిపోకండి.