Zinnia Flower : అంతరిక్షంలో పూసిన ‘జిన్నియా’ ఫ్లవర్.. ఫోటో షేర్ చేసిన నాసా
నాసా వ్యోమగాములు గతంలో పాలకూర, టొమాటోలతో పాటు చిలీ పెప్పర్‌లను పెంచారు. తాజాగా అంతరిక్షంలో పూసిన 'జిన్నియా' పూల ఫోటోను నాసా షేర్ చేసింది. ఆరంజ్ కలర్ రేకులతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫ్లవర్ ఫోటో వైరల్ అవుతోంది.

Zinnia Flower
Zinnia Flower : అంతరిక్షంలో పెరిగిన ‘జిన్నియా’ ఫ్లవర్ అద్భుతమైన ఫోటోను సానా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ రేకులతో జిన్నియా ఫ్లవర్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫ్లవర్ ఫోటో వైరల్ అవుతోంది.
NASA Spacecraft : సూర్యుడికి చేరువైన నాసా స్పేస్ క్రాఫ్ట్.. సౌర తుఫాన్ లపై ప్రత్యేక అధ్యయనం
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో (ISS) పెరిగిన జిన్నియా మొక్క అద్భుతమైన పువ్వు పూసింది. ఈ పువ్వు నారింజ రంగు రేకులతో చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆ పూవుకు చుట్టూ ఉన్న ఆకులు కూడా చిత్రంగా కనిపించాయి. 1970 నుంచి అంతరిక్షంలో మొక్కల విషయంలో పరిశోధనలు జరుగుతున్నాయి. 2015 లో కెజెల్ లిండ్ గ్రెన్ అనే వ్యోమగామి వెజ్జీ సిస్టమ్‌తో ప్రయోగాలు మొదలుపెట్టాడు.
‘ ఈ జిన్నియా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో వెజ్జీ సిస్టమ్‌లో భాగంగా కక్ష్యలో పెరిగింది. 1970 నుంచి అంతరిక్షంలో మొక్కలను శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయోగాన్ని 2015 లో @ISSలో NASA వ్యోమగామి కెజెల్ లిండ్‌గ్రెన్ ప్రారంభించారు’ అని నాసా పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. జిన్నియాను పెంచడం అనేది భూమిపై ఉన్న శాస్త్రవేత్తలకు మైక్రోగ్రావిటీలో మొక్కలు ఎలా పెరుగుతాయో తెలుసుకునే అవకాశం కల్పించిందని నాసా పేర్కొంది.
NASA : అంతరిక్షంలో పండించిన టమాటాలను భూమికి తీసుకొస్తున్న నాసా
నాసా వ్యోమగాములు గతంలో పాలకూర, టొమాటోలతో పాటు చిలీ పెప్పర్‌లను పెంచారు. ఇకపై మరిన్ని కూరగాయలు.. మొక్కలు చాలా పెంచబోతున్నారట.
View this post on Instagram