నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన నిందితుడిని కోర్టు వినూత్న రీతిలో ఆదేశించింది. ఐదు మొక్కలు నాటితే.. అరెస్ట్ వారెంట్ రద్దును చేస్తామని పేర్కొంది. దేశంలో కోర్టు ఈ తరహాలో ఆదేశించడం ఇదే తొలిసారి.
నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన నిందితుడిని ఓ కోర్టు వినూత్న రీతిలో ఆదేశించింది. ఐదు మొక్కలు నాటితే.. అరెస్ట్ వారెంట్ రద్దును చేస్తామని ఘాజియాబాద్ కోర్టు పేర్కొంది. ఇందుకు సమ్మతిగా కోర్టులో అఫడవిట్ ను దాఖలు చేయాల్సిందిగా సదరు నిందితుడికి సూచించినట్టు ఘాజియాబాద్ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ గవర్నరమెంట్ కౌన్సిలర్ (ఏడీజీసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. దేశంలో ఈ తరహాలో కోర్టు ఆదేశించడం ఇదే తొలిసారి.
Read Also : ఆడు మగడ్రా బుజ్జీ: మగాడు బిడ్డకు జన్మనిచ్చాడు
బాలికపై కిడ్నాప్, అత్యాచారానికి పాల్పడినందుకుగానూ లోనీ ప్రాంతానికి చెందిన రాజు అలియాస్ కల్లూ అనే వ్యక్తికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ జడ్జీ రాకేశ్ వశిష్ఠ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ కేసు విషయంలో ఆరు నెలల నుంచి కోర్టుకు హాజరు కాకపోవడంతో రాజుపై కోర్టు పై విధంగా ఆదేశించింది.
నాన్ బెయిలబుల్ వారెంట్ ఆదేశాలపై నిందితుడు రాజు.. వారెంట్ ను రీకాల్ కోరుతూ గురువారం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన కోర్టు.. అత్యాచార నిందితుడిని ఐదు మొక్కలు నాటి.. కోర్టులో అఫడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అందుకు సమ్మతి ఇస్తే.. నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేస్తామని కోర్టు కండీషన్ పెట్టింది.