Rahul Gandhi: రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3) యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ దాఖలైంది. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై నేరం రుజువైన తర్వాత నేరుగా అనర్హత వేటు వేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది దీపక్ ప్రకాశ్ పేర్కొన్నారు.

Rahul Gandhi: ప్రధాని మోదీ (PM Modi) ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు‌గాను రెండేళ్ల జైలు శిక్ష ఎదుర్కొన్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున రాహుల్ గాంధీ లోక్‭సభకు అనర్హుడయ్యారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత వేటు (disqualification) వేశారు. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‭సభ సెక్రెటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలనకు సిద్ధమైంది. తాజాగా రాహుల్ అనర్హత వేటు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Rahul Gandhi: 2013లో ఏ చట్టాన్నైతే రాహుల్ చింపేశారో.. ఇప్పుడదే చట్టానికి బలయ్యారు

రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3) యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ దాఖలైంది. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై నేరం రుజువైన తర్వాత నేరుగా అనర్హత వేటు వేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది దీపక్ ప్రకాశ్ పేర్కొన్నారు. అయితే, దీనిని ఎప్పుడు విచారిస్తారనేది స్పష్టత రాలేదు. రాహుల్ గాంధీపై లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనర్హత వేటు వేస్తూ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ కావడంతో కొంత ఆసక్తికర పరిణామం అని చెప్పొచ్చు.

Rahul Gandhi: మోదీపై వ్యాఖ్యలకు భారీ మూల్యం చెల్లించుకున్న రాహుల్ గాంధీ.. పార్లమెంట్ నుంచి 8 ఏళ్లు ఔట్

ఈ పిటీషన్‌లో ప్రధానంగా.. జిల్లా కోర్టు తీర్పు రాగానే సమయం ఇవ్వకుండా వెంటనే లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ఎంత వరకు సమంజసం అనే విషయంపై ఈ పిటీషన్ దాఖలైంది. అయితే, ఈ పిటీషన్ పై విచారణ జరగాలంటే సోమవారం వరకు వేచి ఉండాలని తెలుస్తోంది. శనివారం, ఆదివారం కోర్టులో ఎలాంటి విచారణలు జరగవు. అయితే, పిటీషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. సీజేఐ ధర్మాసనం దీనిపై ఎప్పుడు విచారణ జరుపుతామనే తేదీని వెల్లడిస్తుంది. దీంతో, ఈ పిటీషన్ అత్యవసరంగా విచారణ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు తనపై అనర్హత వేటు గురించి రాహుల్ గాంధీ ఇవాళ విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ ఎలాంటి న్యాయపోరాటం చేయబోతున్నారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సూరత్ జిల్లా కోర్టు ఇచ్చిన తీరుపైన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించడమా? లేదాంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అనేది క్లారిటీ రానుంది.

ట్రెండింగ్ వార్తలు