సీరం వ్యాక్సిన్ సౌకర్యాలపై పీఎం ఫిదా అయ్యారు.. త్వరగా టీకా రావాలన్నారు : పూనవాలా

  • Publish Date - November 28, 2020 / 09:30 PM IST

PM impressed with your facility : పుణెలోని సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ హబ్‌లను మోడీ సందర్శించారు. మూడు సిటీల పర్యటనలో భాగంగా చివరిగా పుణెలోని సీరమ్ ఇన్సిస్ట్యూట్‌ను సందర్శించారు.



సీరంలోనే గంట పాటు గడిపిన పీఎం అక్కడి వ్యాక్సిన్ ప్రక్రియ, కోల్డ్ స్టోరేజీ ఫెసిలిటీని సమీక్షించారు. సీరమ్ నుంచి Covishield వ్యాక్సిన్ 50 మిలియన్ల డోస్‌లకు పైగా రిలీజ్ చేయనున్నారు.



అంతకంటే ముందు రోజున అహ్మదాబాద్‌లోని మరో ప్రముఖ ఫార్మా కంపెనీ జిందాస్ కాడిలా ప్లాంట్‌ను మోడీ సందర్శించారు. అక్కడి నుంచి పీఎం హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు.

భారతీయ మొదటి స్వదేశీ తయారీ కరోనా వ్యాక్సిన్ అయిన ‘కోవాగ్జిన్’ అభివృద్ధి చేస్తోన్న భారత్ బయోటెక్‌ను మోడీ సందర్శించారు. పుణెలోని సీరమ్‌ను సందర్శించిన సందర్భంగా అక్కడి టాప్ సైంటిస్టులతో మోడీ సంభాషించారు.


ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూనవాలా గ్రూపు చైర్మన్ సైరస్ పూనవాలా మోడీ సందర్శనపై స్పందించారు. ‘మోడీ సందర్శన అద్భుతం.. సీరమ్‌లో వ్యాక్సిన్ తయారీ సౌకర్యాలను చూసి చాలా సంతృప్తి చెందారు.



సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్ బయటకు తీసుకురావాలన్నారు’ అని పూనవాలా చెప్పారు. పుణెలో సీరమ్‌‌ను సందర్శించిన ప్రధాని మోడీకి పూనవాలా ఆయన కుమారుడు, SII సీఈఓ అడార్, భార్యా నటాషా ఘనంగా స్వాగతం పలికారు.