Like Taliban, RSS and BJP are…: Kharge
Mallikarjun Kharge: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. గౌతమ్ అదానీకి దేశంలో ప్రభుత్వ బ్యాంకులు భారీ మొత్తంలో ఎందుకు రుణాలు ఇస్తున్నాయని ఆయన నిలదీశారు.
ఓ వ్యక్తి సంపద రెండున్నర ఏళ్లలో 13 రెట్లు పెరిగిందని చెప్పారు. 2014లో రూ.50,000 కోట్లుగా ఉన్న సంపద, 2019 నాటికి రూ.లక్ష కోట్లకు చేరిందని చెప్పారు. అయితే, ఆ తర్వాత ఒక్కసారిగా రెండున్నరేళ్లలో రూ.12 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. దీని వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటని నిలదీశారు. దీనిపై తాము పార్లమెంటులో అనేక ప్రశ్నలు అడిగామని, కుంభకోణాలు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశామని చెప్పారు.
గుజరాత్ లో పేద ప్రజలు ఓ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటే, అదానీకి మాత్రం కేంద్ర ప్రభుత్వం రూ.82,000 కోట్ల రుణాలు ఇచ్చిందని తెలిపారు. అదానీ విషయంలో దేశ ప్రజలను మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అదానీ గ్రూప్ వ్యవహారం గురించి పార్లమెంటులో తాము అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేదని విమర్శించారు.
Cyber Cheating : కరోనా సర్టిఫికెట్ పేరుతో రూ.లక్ష కొట్టేశారు, మెదక్ జిల్లాలో సైబర్ చీటింగ్ కలకలం