Cyber Cheating : కరోనా సర్టిఫికెట్ పేరుతో రూ.లక్ష కొట్టేశారు, మెదక్ జిల్లాలో సైబర్ చీటింగ్ కలకలం

కరోనా సర్టిఫికెట్ కోసం ఓటీపీ చెప్పాలని కరణ్ కుమార్ ను సైబర్ చీటర్స్ అడిగారు. దీంతో కరణ్ ఓటీపీ చెప్పాడు. అంతే, మూడు నిమిషాల్లో అతడి బ్యాంకు ఖాతాలో ఉన్న లక్ష రూపాయల 5వేలు మాయం చేశారు.

Cyber Cheating : కరోనా సర్టిఫికెట్ పేరుతో రూ.లక్ష కొట్టేశారు, మెదక్ జిల్లాలో సైబర్ చీటింగ్ కలకలం

Cyber Cheating : మెదక్ జిల్లా రామాయంపేటలో సైబర్ చీటింగ్ కలకలం సృష్టించింది. బీహార్ కి చెందిన సూపర్ వైజర్ కరణ్ కుమార్ అకౌంట్ నుంచి లక్ష రూపాయలు మాయం చేశారు. కరోనా సర్టిఫికెట్ కోసం ఓటీపీ చెప్పాలని కరణ్ కుమార్ ను సైబర్ చీటర్స్ అడిగారు. దీంతో కరణ్ ఓటీపీ చెప్పాడు. అంతే, మూడు నిమిషాల్లో అతడి బ్యాంకు ఖాతాలో ఉన్న లక్ష రూపాయల 5వేలు మాయం చేశారు. బీహార్ కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులను దోచేశారని బాధితుడు వాపోయాడు. సైబర్ చీటింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read..Cyber Crime: సైబర్ ఉచ్చులో కామారెడ్డి వాసి.. లింక్‌పై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్న యువకుడు

పెరుగుతున్న టెక్నాలజీతో పాటు నేరాలు, మోసాలు కూడా పెరుగుతున్నాయి. టెక్నాలజీని కొందరు కేటుగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఏ మాత్రం అలర్ట్ గా లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పందంటున్నారు పోలీసులు. మనకు విషయం తెలిసేలోపే అనర్థం జరిగిపోతోంది. అందుకే, అప్రమత్తత, జాగ్రత్త అవసరం అంటున్నారు పోలీసులు.

Cyber crime : లాటరీలో కారు గెలిచారంటూ మెసేజ్.. మహిళ ఎకౌంట్ నుంచి రూ.14 లక్షలు మాయం

సైబర్ నేరాలపై ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొందరు జాగ్రత్తపడటం లేదు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిత్యం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. సైబర్ నేరాల విషయంలో అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, నేరాలు జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. నేరం జరిగిన వెంటనే కాల్ చేసి, ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బు రికవరీ చేసే అవకాశాలున్నాయని చెప్పారు. అలాగే గుర్తు తెలియని నెంబర్స్ నుంచి వచ్చే లింక్స్ క్లిక్ చేయకూడదని సూచిస్తున్నారు పోలీసులు.