Cyber Crime: సైబర్ ఉచ్చులో కామారెడ్డి వాసి.. లింక్‌పై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్న యువకుడు

సైబర్ నేరగాళ్లు పంపిన లింక్‌పై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్నాడో తెలంగాణ వ్యక్తి. కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామానికి చెందిన ఒక యువకుడికి లక్కీ డ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక లింక్ పంపారు.

Cyber Crime: సైబర్ ఉచ్చులో కామారెడ్డి వాసి.. లింక్‌పై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్న యువకుడు

Cyber Crime: సైబర్ నేరాలపై ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొందరు జాగ్రత్తపడటం లేదు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి అకౌంట్లోని డబ్బు మొత్తం పోగొట్టుకుంటున్నారు.

Janasena: రేపే జనసేన ‘యువశక్తి సభ’.. ఏర్పాట్లు పరిశీలించిన నాదెండ్ల, నాగబాబు

సైబర్ నేరగాళ్లు పంపిన లింక్‌పై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్నాడో తెలంగాణ వ్యక్తి. కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామానికి చెందిన ఒక యువకుడికి లక్కీ డ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక లింక్ పంపారు. లింక్ రిసీవ్ చేసుకున్న యువకుడు ఆ లింక్‌పై క్లిక్ చేశాడు. అంతే అతడి అకౌంట్లోని రూ.68,187 డబ్బు మాయమైంది. సైబర్ నేరగాళ్లు ఈ మొత్తాన్ని తమ అకౌంట్‌కు మార్చుకున్నారు.

United States: అమెరికాలో దేశవ్యాప్తంగా నిలిచిపోయిన విమానాలు.. కారణం అదే!

తీరా కొద్దిసేపటి తర్వాత ఈ విషయం గ్రహించిన యువకుడు తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు. అనంతరం దేవునిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో కూడా కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఇలాగే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.4 లక్షల వరకు డబ్బు పోగొట్టుకున్నాడు.

Delhi airport: ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో బహిరంగ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. అరెస్టు

ఇటీవల ఇలాంటి సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఇంకొందరు పరువు కోసం ఫిర్యాదు చేయట్లేదు. సైబర్ నేరాల విషయంలో అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నేరాలు జరిగిన వెంటనే 1931 నెంబర్‌‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

నేరం జరిగిన వెంటనే కాల్ చేసి, ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బు రికవరీ చేసే అవకాశాలున్నాయి. అలాగే గుర్తు తెలియని నెంబర్స్ నుంచి వచ్చే లింక్స్ క్లిక్ చేయకూడదని సూచిస్తున్నారు పోలీసులు.