United States: అమెరికాలో దేశవ్యాప్తంగా నిలిచిపోయిన విమానాలు.. కారణం అదే!

అమెరికాలో విమానాల రాకపోకల్ని పర్యవేక్షించే ‘ద ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్’ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. విమానాలు నిలిచిపోయిన సమాచారాన్ని సంస్థ పైలట్లు, విమానయాన సంస్థలు, సిబ్బందికి తెలియజేసింది.

United States: అమెరికాలో దేశవ్యాప్తంగా నిలిచిపోయిన విమానాలు.. కారణం అదే!

Updated On : January 11, 2023 / 5:43 PM IST

United States : అగ్రరాజ్యం అమెరికాలో విమానాలు పూర్తిగా నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా విమాన ప్రయాణాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా విమానాలు నిలిచిపోయాయని స్థానిక మీడియా వెల్లడించింది.

Delhi airport: ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో బహిరంగ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. అరెస్టు

అమెరికాలో విమానాల రాకపోకల్ని పర్యవేక్షించే ‘ద ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్’ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ‘‘ప్రస్తుతం సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నాం. దీంతో విమానాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా విమానాల్ని నడపలేకపోతున్నాం” అని ఫెడరల్ ఏవియేషన్ సంస్థ ప్రకటించింది. విమానాలు నిలిచిపోయిన సమాచారాన్ని సంస్థ పైలట్లు, విమానయాన సంస్థలు, సిబ్బందికి తెలియజేసింది.

RRR Team at Golden Globe Awards Event : గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకకి ఫ్యామిలీ సమేతంగా RRR యూనిట్..

విమానాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయనే సమాచారాన్ని అందించలేకపోతున్నట్లు తెలిపింది. ఫెడరల్ ఏవియేషన్ సంస్థ వెబ్‌సైట్‌లో కూడా విమానాల గురించి తగిన సమాచారం లేదు. ప్రస్తుతం 400 విమానాలు నిలిచిపోయాయి. విమానాలు నిలిచిపోవడంపై ఇంకా పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.