Janasena: రేపే జనసేన ‘యువశక్తి సభ’.. ఏర్పాట్లు పరిశీలించిన నాదెండ్ల, నాగబాబు

వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కరువైంది. ఈ సభ ద్వారా యువతలో భరోసా నింపుతాం. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగింది.

Janasena: రేపే జనసేన ‘యువశక్తి సభ’.. ఏర్పాట్లు పరిశీలించిన నాదెండ్ల, నాగబాబు

Janasena: జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘యువశక్తి సభ’ గురువారం జరగనుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఉదయం 11 గంటలకు సభ ఆరంభమవుతుంది.

Delhi airport: ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో బహిరంగ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. అరెస్టు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు తదితరులు ఈ సభకు హాజరవుతారు. సభా ఏర్పాట్లను నాదెండ్ల, నాగబాబు బుధవారం పరిశీలించారు. సభాస్థలికి చేరుకుని నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నాదెండ్ల మాట్లాడుతూ ‘‘రాజకీయాల్లో మార్పు కోసం జనసేన ప్రయత్నిస్తోంది. అందుకే యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సభలో ఉత్తరాంధ్ర ఎదుర్కొంటున్న సమస్యలు, నాయకత్వ వైఫల్యం, వనరుల గురించి చర్చిస్తాం.

United States: అమెరికాలో దేశవ్యాప్తంగా నిలిచిపోయిన విమానాలు.. కారణం అదే!

వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కరువైంది. ఈ సభ ద్వారా యువతలో భరోసా నింపుతాం. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగింది. ఏపీలో ఉపాధి, పెట్టుబడులు లేవు. యువశక్తి సభకు ‘వివేకానంద వికాస వేదిక’ అని పేరు పెట్టాం. జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ఈ సభ ద్వారా తెలియజేస్తాం. మా పాలసీని వివరిస్తాం. రాష్ట్రంలో బటన్ నొక్కుడు తప్ప.. అభివృద్ధి ఏమీ లేదు.

మత్స్యకారులను ఈ ప్రభుత్వం మోసం చేసింది” అని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మరో నేత నాగబాబు మాట్లాడుతూ ‘‘ఏపీ మంత్రులకు ప్రతిపక్షాల్ని విమర్శించడం తప్ప మరో పని లేదు. యువత ఆలోచన, ఆవేదన చెప్పుకొనేందుకు యువశక్తి సభ మంచి అవకాశం” అని వ్యాఖ్యానించారు.