Cyber crime : లాటరీలో కారు గెలిచారంటూ మెసేజ్..మహిళ ఎకౌంట్ నుంచి రూ.14 లక్షలు మాయం

లాటరీలో కారు గెలిచారంటూ మెసేజ్ చేసి మహిళ ఎకౌంట్ నుంచి రూ.14 లక్షలు మాయం చేసారు కేటుగాళ్లు.

Cyber crime : లాటరీలో కారు గెలిచారంటూ మెసేజ్..మహిళ ఎకౌంట్ నుంచి రూ.14 లక్షలు మాయం

Cyber crime _

Cyber crime : ఆంధ్రప్రదేవ్ పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో సైబర్ నేరంతో ఓ మహిళ బ్యాంక్ ఎకౌంట్ నుంచి రూ.14లక్షలు మాయం చేశారు కేటుగాళ్లు. లాటరీలో మీకు కారు బహుమతిగా గెలుచుకున్నారంటూ ఫోన్ లో మెసెజ్ పంపించారు. దీంతో సదరు మహిళ తెగ సంబరడిపోయింది. లాటరీలో గెలుచుకున్న కారు మీకు ఇవ్వాలంటూ ఆధార్ కార్డు,పాన్ కార్డుతో పాటు బ్యాంక్ ఎకౌంటర్ కు సంబంధించి వివరాలు చెప్పాలని అని చెప్పారు సదరు కేటుగాళ్లు. అది నమ్మిన సదరు మహిళ అన్ని వారికి అందించింది. అంతే తమ పాచిక పారటంతో సదరు మహిళ బ్యాంక్ ఎకౌంట్ నుంచి రూ.14లక్షలు మాయం చేశారు సైబర్ నేరగాళ్లు. ఆ తరువాత ఎటువంటి సమాచారం లేకపోవటంతో మోసపోయానని గ్రహించిన సదరు బాధితురాలు పోలీసులకు మొరపెట్టుకుంది. బాధితురాలని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని మీ బ్యాంకులకు..మీకు సంబంధించిన వివరాలను ఎవరు అడిగినా చెప్పవద్దంటూ పోలీసులు ఎంతగా చెప్పినా అమాయకత్వం..లేదా అత్యాశకు పోయి ఇటువంటి మోసాలకు బలి అయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఎంతోమంది. టెక్నాలజీని ఉపయోగించి జనాల డబ్బుల్ని దోచుకుంటున్నారు.టెక్నాలజీని ఉపయోగించి నేరగాళ్లు తెలివితేటలతో జనాల బలహీనతో బ్యాంకుల ఖాతాల వివరాలను తెలుసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఖాతాదారుల ఫోన్‌ నెంబర్లు తెలివిగా సేకరించి వారికి ఫోన్లు చేసి బుట్టల్లో వేసుకుంటున్నారు.

ఫోన్‌లు చేసి..మీకు లాటరీ తగిలిందని బ్యాంక్‌ ఖాతాలు, ఏటీఎం కార్డు నెంబర్లు, ఆధార్‌ కార్డుల నెంబర్ల వివరాలు తెలుసుకుని ఖాతాలను తెరిచి అందులో నుంచి డబ్బులు దోచేస్తున్నారు. గుర్తు తెలియని ఫోన్‌ నెంబర్ల ద్వారా వచ్చే ఫోన్‌ కాల్స్‌ వచ్చినా..మెసేజ్ లు వచ్చినా ఎటువంటి సమాచారాన్ని ఇవ్వవద్దని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా చాలామంది ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏపీలోని తాడేపల్లి గూడెంలో జరిగింది కూడా అదే.

లాటరీలో మీకు కారు బహుమతిగా గెలుచుకున్నారంటూ ఓ మహిళకు ఫోన్ లో మెసెజ్ పంపించి ఆమె ఆధార్ కార్డు,పాన్ కార్డుతో పాటు బ్యాంక్ ఎకౌంటర్ కు సంబంధించి వివరాలు తెలివిగా రాబట్టి ఆమె బ్యాంక్ ఎకౌంట్ లోని రూ.14లక్షలు మాయం చేశారు.